బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన ఓ వ్యాపార ప్రకటన వివాదాల్లో చిక్కుక్కుంది. 'కల్యాణ్ జ్యూవెలర్స్'కి చెందిన ఈ యాడ్‌లో అమితాబ్, ఆయన కూతురు శ్వేతా నందాతో కలిసి తొలిసారి నటించడం విశేషం.

ఈ యాడ్
ఈ యాడ్ బ్యాంకుల పనితీరున విమర్శించేలా, బ్యాంకు సిబ్బందిని అవమానించేలా ఉందంటూ యూనియన్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ విమర్శిస్తోంది. భేషరతుగా వెంటనే క్షమాపణ చెప్పాలంటూ దావా దాఖలు చేసింది.

ఏముందంటే
ఇంతకీ ప్రకటనలో ఏముందంటే అమితాబ్ తన కూతురితో కలిసి ఆటోలో ఓ ప్రభుత్వ బ్యాంకుకి వస్తారు. వృద్ధ వయసులో మెట్లన్నీ ఎక్కుతూ లోపలికి వెళ్తారు. అక్కడ బ్యాంకు సిబ్బంది ఆయన పట్ల, ఆయన కూతురి పట్ల దురుసుగా ప్రవర్తించడం తిప్పించడం చూపిస్తారు.

పెన్షన్ రెండు సార్లు
బ్యాంకు మేనేజర్‌ను కలవాలని సిబ్బంది సూచించడం. మేనేజర్ కోసం వాళ్లు వేచి చూడడం. పెన్షన్ రెండు సార్లు వచ్చిందని అమితాబ్ చెబితే పార్టీ చేసుకోమని చెబుతాడు బ్యాంకు మేనేజర్

వెటకారంగా
కానీ పెన్షన్ వెనక్కి ఇచ్చేసేందుకు వచ్చామని చెబుతుంది శ్వేతానందా. ఎందుకింత కష్టపడుతున్నారు. ఎవరికి తెలుస్తుంది అని వెటకారంగా అంటాడు మేనేజర్. దానికి అమితాబ్ నాకు తెలుసు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా తప్పు తప్పే అని చెబుతాడు.

కంపెనీ లోగోతో
దాంతో మేనేజర్ సంతకం చేస్తాడు. ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో అక్కడ నమ్మకం ఉంటుంది అంటూ కంపెనీ లోగోతో ప్రకటన ముగుస్తుంది.

బ్యాంకుల్లో సొమ్ము
ఒకటిన్నర నిమిషున్న ఈ యాడ్ ‘బ్యాంకుల్లో పనిచేస్తున్న మూడు లక్షల 20 వేల మంది ఉద్యోగులనూ, బ్యాంకుల్లో సొమ్ము డిపాజిట్ చేసుకున్న లక్షల మంది నమ్మకాన్ని దెబ్బతిసేలా ఉందం'టూ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్ కన్ఫేడరేషన్ ఆరోపించింది. బ్యాంకులను విమర్శించేలా ప్రకటనను రూపొందించిన కల్యాణ్ జ్యూవెలర్స్‌పై దావా వేసింది.
ట్వీట్టర్లో పోస్ట్ చేస్తూ
కూతురు శ్వేతానందాతో కలిసి తొలిసారి నటించడంతో ఈ వీడియోను ట్వీట్టర్లో పోస్ట్ చేస్తూ నాకు ఇదో ఎమోషనల్ మూమెంట్. ఈ ప్రకటన చూసిన ప్రతిసారీ నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. కూతుర్లు ఎప్పుడూ బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications