For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గూగుల్ సంస్థకు భారీ జరిమానా విధించిన ఈయూ.

యూరోపియన్ యాంటీట్రస్ట్ రెగ్యులేటర్స్ గూగుల్ కు బుధవారం 4.34 బిలియన్ యూరోలు (5 బిలియన్ డాలర్లు) రికార్డు స్థాయిలో జరిమానా విధించింది.

|

యూరోపియన్ యాంటీట్రస్ట్ రెగ్యులేటర్స్ గూగుల్ కు బుధవారం 4.34 బిలియన్ యూరోలు (5 బిలియన్ డాలర్లు) రికార్డు స్థాయిలో జరిమానా విధించింది, బ్రౌజర్‌ వినియోగాన్ని పెంచుకునేందుకు స్మార్ట్‌ఫోన్స్‌ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఆధిపత్యం ఉన్న ఆండ్రాయిడ్‌ను గూగుల్ ఉపయోగించుకుందని ఈయూ కాంపిటీషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టాజర్ పేర్కొన్నారు.

గూగుల్ సంస్థకు భారీ జరిమానా విధించిన ఈయూ.

ఉత్పత్తులను పోల్చి చూపే సర్వీసులను అందించడంలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 2017లో గూగుల్‌పై ఈయూ కమిషన్ 2.4 బిలియన్ యూరోల మేర జరిమానా విధించింది.ఐతే తాజాగా విధించిన పెనాలిటీ మునుపటి దానికంటే రెట్టింపు కావడం గమనార్హం.

ఈయూ నిబంధనల ప్రకారం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వార్షికాదాయంలో 10 శాతం దాకా జరిమానా విధించవచ్చు. గతేడాది ఆల్ఫాబెట్ ఆదాయం 110.9 బిలియన్ డాలర్లు.

యురోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడే జంకర్ అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను వచ్చే బుధవారం వైట్హౌస్ లో కలుసుకోనున్నారు, యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను పెంచడం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన తరుణంలో గూగుల్‌పై ఈయూ కమిషన్ రికార్డు స్థాయిలో జరిమానా విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అలాగే, ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ కోడ్‌ ఆధారిత పోటీ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో హ్యాండ్‌సెట్స్‌ను ఉత్పత్తి చేయకుండా తయారీ సంస్థలను కూడా గూగుల్ అడ్డుకుంటోందంటూ ఏప్రిల్‌లో ఫిర్యాదు నమోదైంది.స్మార్ట్‌ఫోన్స్‌లో క్రోమ్ బ్రౌజర్‌తో పాటు తమ సెర్చి ఇంజిన్‌ను ఇన్‌స్టాల్ తప్పనిసరిగా చేయాల్సిందేనంటూ శాంసంగ్ వంటి హ్యాండ్‌సెట్ తయారీ సంస్థలకు గూగుల్ షరతులు విధిస్తోందని అభియోగాలు వచ్చాయి.

Read more about: google
English summary

గూగుల్ సంస్థకు భారీ జరిమానా విధించిన ఈయూ. | Europe Hits Google With record $5 Billion Antitrust Fine, Appeal Ahead

BRUSSELS (Reuters) - European antitrust regulators fined Google a record 4.34 billion euro ($5 billion) on Wednesday and ordered it to stop using its popular Android mobile operating system to block rivals, a ruling which the U.S. tech company said it would appeal.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X