For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రేడ్ వార్ తో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకి చాలా నష్టం మళ్ళీ ఉద్యోగులలో టెన్షన్!

By Sabari
|

దేశాల మధ్య వాణిజ్య యుద్ధంతో ప్రపంచానికే నష్టమని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) హెచ్చరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపు 500 బిలియన్ డాలర్ల ప్రభావం ఉంటుందని చెబుతోంది ఐఎంఎఫ్.

అమెరికా టారిఫ్ వార్‌తో దేశాల మధ్య నెలకొన్ని ఆర్థిక వివాదాలు ఆర్థిక వ్యవస్థను పట్టాలు తప్పిస్తుందని, మధ్య-కాల వృద్ధి అవకాశాలనూ తగ్గిస్తుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. ఒకవేళ అమెరికా టారిఫ్ బెదిరింపులు, అందుకు ప్రతీకారంగా ఇతర దేశాల చర్యలు తీవ్రమైతే వార్షిక ఆర్థిక వృద్ధి 0.5 శాతం చొప్పున తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అయితే 2018, 2019లో మాత్రం ప్రపంచ ఆర్థిక వృద్ధి 3.9 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ చెబుతోంది. అంటే గతంతో పోలిస్తే 500 బిలియన్ డాలర్ల ఔట్‌పుట్ తగ్గుతుందని అంచనా.

ట్రేడ్ వార్ తో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకి చాలా నష్టం మళ్ళీ ఉద్యోగులలో టెన్షన్!

స్టీల్, అల్యూమినియంపై యూఎస్ గ్లోబల్ టారిఫ్స్, 34 బిలియన్ డాలర్ల చైనా వస్తువులపై సుంకాలు గ్లోబల్ ఎకనమిక్ ఔట్‌పుట్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. వీటికి తోడు మరో 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై టారిఫ్స్, కార్ల దిగుమతులపై 25 శాతం యూఎస్ గ్లోబల్ టారిఫ్‌ను విధించే అంశం పరిశీలనలో ఉంది.

ప్రస్తుతం వాణిజ్య వాతావరణంలో నెలకొన్ని పరిస్థితులు విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. తమ ఎగుమతులపై ప్రపంచమార్కెట్లల్లో పన్నులు ఎక్కువగా వసూలు చేస్తున్నారని అమెరికా భావించడం వాణిజ్య యుద్ధానికి దారితీసింది. ఇప్పుడీ వాణిజ్య పోరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది.

Read more about: trade war
English summary

ట్రేడ్ వార్ తో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకి చాలా నష్టం మళ్ళీ ఉద్యోగులలో టెన్షన్! | Trade War Effect on World Economy

The International Monetary Fund (IMF) has warned that the world's trade with the trade war between countries. The IMF says the global economy will have an impact of $ 500 billion.
Story first published: Tuesday, July 17, 2018, 22:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X