డాలర్ తో పోల్చి చూస్తే మంగళవారం రూపాయి బలపడింది.
US ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ మ్యునిన్ వ్యాఖ్యల తర్వాత ముడి చమురు ధరలు తగ్గిన కారణంగా మంగళవారం నాడు రూపాయి బలపడింది.
US ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ మ్యునిన్ వ్యాఖ్యల తర్వాత ముడి చమురు ధరలు తగ్గిన కారణంగా మంగళవారం నాడు రూపాయి బలపడింది. ఉదయం 9.15 గంటలకు రూపాయి 68.36 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతకుముందు 68.57 పాయింట్ల నుంచి 0.31 శాతం పెరిగింది. వరుసగా 68.36 గరిష్ట స్థాయిని, 68.41 కనిష్ట స్థాయిలను తాకింది.

ఇరాన్ నుండి చమురు దిగుమతి చేసుకున్న దేశాలపై అమెరికా అధికారులు సూచించిన ఆంక్షల నేపథ్యంలో సోమవారం ముడి చమురు ధరలు 4 శతం పడిపోయాయి.పదేళ్ల బాండ్ ఈల్డ్ 7.801 నుంచి 7.761కి తగ్గింది. బాండ్ ఈల్డ్, కరెన్సీ ధరల పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. ఈ ఏడాదిలో చూసుకుంటే రూపాయి 6.55 శాతంమేర క్షీణంచింది.
బెంచ్మార్క్ సెన్సెక్స్ ఇండెక్స్ 0.22 శాతం, 78.44 పాయింట్లు పెరిగి 36,318.09 వద్ద ముగిసింది. జనవరి నుంచి, అది 6.6% పెరిగింది.
సోమవారం డాలర్ బలహీనతతో ఆసియా కరెన్సీలు ప్రధానంగా బలంగా ఉన్నాయి. దక్షిణ కొరియా 0.39 శాతం, చైనా రెన్మిన్బి 0.18 శాతం, చైనా ఆఫ్షోర్ 0.12 శాతం, సింగపూర్ డాలర్ 0.07 శాతం, థాయ్ బట్ 0.07 శాతం, తైవాన్ డాలర్ 0.06 శాతం పెరిగాయి. అయితే, జపనీస్ యెన్ 0.12%, మలేషియా రింగిట్ 0.08% పడిపోయింది.
ప్రధాన కరెన్సీలపై అమెరికా కరెన్సీ బలం కొలిచే డాలర్ ఇండెక్స్ 94.514 వద్ద ముగిసింది, దాని మునుపటి ముగింపు 94.511 నుండి 0.01% పెరిగింది.


Click it and Unblock the Notifications