For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IRCTCలో మీరు తినే ఆహారం రేట్లు తెలుసుకోండి ఇలా!

By Sabari
|

మీరు రైలు టికెట్లు IRCTCలో తీసుకుంటే, ఇక మీదట ఆ టికెట్ మీద ఫుడ్ ఐటమ్స్ లిస్ట్, రేట్లు కూడా ఉంటాయి.అన్నిచోట్లా రైళ్లలో ఆహారం దొరకదు. దొరికినా దాని రేటు ఎంతో తెలీదు. ఎంత అడిగితే అంత ఇవ్వడం తప్ప మరో అవకాశం లేదు.

 ఐఆర్‌సీటీసీ

ఐఆర్‌సీటీసీ

ఈ మధ్య రైల్వే శాఖకు ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి సమస్యకు ఐఆర్‌సీటీసీ ఓ ప్రయోగం చేసింది. ఐఆర్‌సీటీసీలో టికెట్లు మీద మొత్తం ఆహారపదార్థాల లిస్ట్, రేట్లు ప్రింట్ చేస్తోంది.

టికెట్ ప్రింట్

టికెట్ ప్రింట్

టికెట్ ప్రింట్ తీసుకున్న తర్వాత చూస్తే చివర్లో ఆ జాబితా మొత్తం కనిపిస్తుంది. ఆ టికెట్ మనతోనే ఉంటుంది కాబట్టి, ఎవరైనా ఎక్కువ ధర చెబితే, వెంటనే ఆ లిస్ట్ చూపించి ప్రశ్నించవచ్చు.

లిస్ట్ ప్రకారం

లిస్ట్ ప్రకారం

IRCTC లిస్ట్ ప్రకారం టీ, కాఫీ రూ.7, లీటర్ వాటర్ బాటిల్ రూ.15, అరలీటర్ వాటర్ బాటిల్ రూ.10 జనతా భోజనం రూ.20. దీనికి అదనంగా రూపాయి కూడా ఇవ్వాల్సిన పనిలేదు.బ్రెడ్ - బటర్, కట్ లెట్ రూ.30, ఇడ్లీ, వడ - రూ.30, ఆమ్లెట్ రూ.35

శాకాహార భోజనం

శాకాహార భోజనం

శాకాహార భోజనం రూ.50 (అన్నం, రొట్టె, పప్పు లేదా సాంబార్, కూర, పచ్చడి, మంచినీళ్లు) మాంసాహార భోజనం రూ.55 (అన్నం, రొట్టె, పప్పు లేదా సాంబార్, కోడిగుడ్డు కూర, పచ్చడి, మంచినీళ్లు).

Read more about: irctc
English summary

IRCTCలో మీరు తినే ఆహారం రేట్లు తెలుసుకోండి ఇలా! | Know Food Rates in IRCTC Now

If you take train tickets in IRCTC, then the ticket will have food items list and rates. There is no food in trains everywhere. Even if it does not know its rate. No matter how much you ask, there is no chance.
Story first published: Saturday, July 14, 2018, 14:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X