ఈ విషయంలో చంద్రబాబు నాయుడుకి మంచి కిక్ ఇచ్చింది అంటా ఇంతకీ ఏంటో ఆ విషయం మీరే చూడండి.
సులభతర వాణిజ్య విధానంలో ఏపీ టాప్ ప్లేస్‌లో నిలవడం చారిత్రక విజయం అన్నారు సీఎం చంద్రబాబు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి తాను ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పారు.

రెండేళ్ల క్రితం
రెండేళ్ల క్రితం రెండో స్థానంలో ఉన్న తాము. గత ఏడాది తెలంగాణతో కలసి తొలిస్థానాన్ని పంచుకున్నామని, ఇప్పుడు మొదటిస్థానానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఘనత సాధించేందుకు కారణమైన మంత్రులు, అధికారులను సీఎం అభినందించారు.

ఈ ఘనత
నాలుగేళ్లలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారంటూ ప్రశంసించారు. టాప్ ప్లేస్‌ని ఎప్పటికీ నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికివచ్చిన పెట్టుబడిదారులు అత్యంత సంతృప్తిగా ఉండడం వల్లే. ఈ ఘనత సాధించామన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెం.1 రావడం చారిత్రక విజయం. నేను చెప్పింది చేతల్లో నిరూపించా. మనకి మనం చెప్పుకోవడం కాకుండా, మన ఘనతను బయటివారు గుర్తిస్తే ఆ విజయానికి గుర్తింపు ఉంటుంది

ఎంతో కిక్
ఫస్ట్ ప్లేస్ రావడం ఎంతో కిక్ ఇచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి ప్రాధమిక అనుమతులు సకాలంలో ఇస్తున్నాం. 86.5శాతం మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కూడా మనమే ఎప్పుడూ ముందుంటాం. తిరుగులేని శక్తిగా అవతరిస్తాం.

పెట్టుబడిదారులు
ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వారి మీద సీఎం ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అత్యంత నీతివంతమైన, పారదర్శకమైన పాలన సాగుతుంది కాబట్టే పెట్టుబడిదారులు ఏపీకి వస్తున్నారని చెప్పారు.

కియా మోటార్స్
కియా మోటార్స్ కూడా రాష్ట్రానికి రావడానికి అదే కారణమన్నారు. టీడీపీ నాలుగేళ్ల పాలనను విమర్శిస్తున్న వాళ్లు నాలుగేళ్ల ముందు రాష్ట్రానికి ఏమేం ఇండస్ట్రీలు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు

రాష్ట్రాన్ని
రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి, బ్రాండ్ ఏపీని దిగజార్చారని మండిపడ్డారు.

విమర్శించే వారు
తమను విమర్శించే వారు రాష్ట్రంలోని ఏ మారుమూల పల్లెలో ఉన్న మారుమూల ఇంటికైనా వెళ్లి చూడాలని, వారిలో కూడా మార్పు తీసుకొచ్చిన ఘనత తమకే దక్కుతుందని చెప్పారు.
ట్విట్టర్ ద్వారా
ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ద్వారా తెలిపారు


Click it and Unblock the Notifications