For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చంద్రబాబు పై అమితమైన ప్రేమ చూపిస్తున్న హిజ్రాలు అసలు ఏమి చేసారో తెలుసా?

By Sabari
|

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు హిజ్రాలు ఆలయం నిర్మిస్తున్నారు. తమకు ఇచ్చిన హామీలు అమలు చేసిన దేవుడిగా హిజ్రాలు చంద్రబాబును భావిస్తున్నారు.

పెన్షన్

పెన్షన్

దీంతో ఆయనకు గుడికట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన భూమిపూజ కూడా చేశారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో హిజ్రాలకు రూ.1500 పెన్షన్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం, వారికి పెన్షన్ వచ్చేలా చూశారు.

ఇచ్చిన మాట ప్రకారం

ఇచ్చిన మాట ప్రకారం

అదే సమయంలో వారికి ఇళ్లు నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోందని చెప్పారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్న చంద్రబాబుకు హిజ్రాలు గుడికట్టాలని నిర్ణయించారు. ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, భూమాబ్రహ్మానందరెడ్డి, కలెక్టర్ హాజరయ్యారు

 ఆలయం కోసం

ఆలయం కోసం

చంద్రబాబు ఆలయం కోసం హిజ్రాలు రూ.2 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. 40 సెంట్ల భూమిలో ఈ ఆలయం నిర్మిస్తున్నారు. గుడిలో 10 కేజీల వెండి విగ్రహాన్ని (చంద్రబాబు ఆకృతిలో) తయారు చేయిస్తున్నారు.

అఖిలభారత హిజ్రాల

అఖిలభారత హిజ్రాల

అఖిలభారత హిజ్రాల ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన నిధుల సేకరణ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా సహకారం తీసుకుంటున్నారు.

 చంద్రబాబు కూడా

చంద్రబాబు కూడా

ఇప్పటికే రెండుసార్లు ఏపీ సీఎంను కలిసి ఆలయానికి సంబంధించిన వివరాలను అందించారు. చంద్రబాబు కూడా వారికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

తమకోసం రూ.20 కోట్లు

తమకోసం రూ.20 కోట్లు

దేశంలోని ఏ రాష్ట్రంలోనూ హిజ్రాల కోసం ప్రభుత్వాలు ఏమీ చేయలేదని, ఏపీ సీఎం ఒక్కరే తమ సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నారని హిజ్రాలు సంతోషం వ్యక్తం చేశారు. గత బడ్జెట్ లో ప్రత్యేకంగా తమకోసం రూ.20 కోట్లు కేటాయించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Read more about: andhra pradesh
English summary

చంద్రబాబు పై అమితమైన ప్రేమ చూపిస్తున్న హిజ్రాలు అసలు ఏమి చేసారో తెలుసా? | Hizras Going to Build Temple for Chandra Babu Naidu With Huge Amount

Hijras Temple is being constructed for AP CE Chandrababu Naidu. Hijras are looking for Chandra Babu as the God who fulfills the assurances given to them.
Story first published: Tuesday, July 10, 2018, 13:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X