రిలయన్స్ జియో ప్రభావం వల్ల ఈ కంపెనీలకు పెద్ద దెబ్బ ఏవో మీరే చూడండి
రిలయన్స్ జియో ప్రారంభించబోయే బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల వల్ల రానున్న కాలంలో మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు (ఎంఎస్‌ఒ), డైరెక్ట్ టు హోమ్ (డిటిహెచ్) సంస్థలపై ప్రభావం పడనుందని ఇండియా రేటింగ్స్ చెబుతోంది

ముకేష్ అంబానీ
జియో సేవల వల్ల కంటెంట్‌ను సమకూర్చే వారికి మాత్రం ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. జియో గిగాఫైబర్ పేరుతో ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను 1,100 నగరాల్లో ప్రారంభించనున్నట్టు ఇటీవలే రిలయన్స్ ఇండస్ర్టీస్ అధినేత ముకేష్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆగస్టు 15వ
గృహాలు, వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకునే ఈ సర్వీసులను జియో అందించనుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి జియో బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం రిజిస్ర్టేషన్లు ప్రారంభంకానున్నాయి.

డిటిహెచ్
కాగా జియో అందించే సేవలు, టారిఫ్‌లు, వినియోగదారుల సంఖ్యను బట్టి ఎంఎస్‌ఒలు, డిటిహెచ్ ఆపరేటర్లపై పడే ప్రభావం ఆధారపడి ఉంటుందని ఇండియా రేటింగ్స్ నివేదిక పేర్కొంది.

ఈ ప్రభావం
ఈ ప్రభావం ఏవిధంగా ఉంటుందో 2019-20 ఆర్థిక సంవత్సరంలో తె లుస్తుందని తెలిపింది. కాగా మన దేశంలో ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల వినియోగం ఇతర దేశాలతో పోల్చితే చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్టు పేర్కొంది

దేశంలో
దేశంలోని 29 కోట్ల కుటుంబాల్లో కేవలం 7 శాతం మాత్రమే ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను కలిగి ఉన్నట్టు తెలిపింది. జియో 5 కోట్ల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుందని, ఇది సాధ్యమేనని పేర్కొంది

నెలవారీ చార్జీలు
ప్రస్తుతం కుటుంబాలు వినియోగించుకుంటున్న బ్రాడ్‌బ్యాండ్ నెలవారీ చార్జీలు 500-600 రూపాయల స్థాయిలో ఉన్నాయని, ఈ లెక్కన 5 కోట్ల కుటుంబాలు అంటే 30,000-36,000 కోట్ల రూపాయల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది


Click it and Unblock the Notifications