For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా కుమారస్వామి... రైతులు ఫుల్ ఖుషి ఏంటో చూడండి.

By Sabari
|

తాము అధికారంలోకి వస్తే.. రైతు రుణమాఫీ చేస్తామని జేడీఎస్ నేతగా హెచ్‌డీ కుమారస్వామి హామీ ఇచ్చారు. సంకీర్ణ ప్రభుత్వంలో చిన్న పార్టీగా ఉన్నా.ఆ హామీని నిలబెట్టుకున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి

కర్ణాటక ముఖ్యమంత్రి

కర్ణాటక ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో రూ.34,000కోట్ల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు.

గత ఎన్నికల ప్రచారం

గత ఎన్నికల ప్రచారం

గత ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీ మేరకు ఈ రుణమాఫీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. గత ఏడాది డిసెంబర్ 31 లోపు రుణాలు తీసుకున్న వారిని ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. దీంతో రుణమాఫీ కోసం ఒత్తిడి తెస్తున్న బీజేపీకి కూడా కుమారస్వామి చెక్ పెట్టారు.

 కొత్త ప్రభుత్వం

కొత్త ప్రభుత్వం

కర్ణాటక ముఖ్యమంత్రిగానే కాకుండా ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా కుమారస్వామి చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆయన అన్ని శాఖలతో కలసి తీవ్రంగా కసరత్తు చేశారు.

 రుణమాఫీ

రుణమాఫీ

అదే క్రమంలో తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ అయిన రుణమాఫీ మీద కూడా తీవ్రంగా మేధోమథనం నిర్వహించారు. అనంతరం బడ్జెట్‌ లో రుణమాఫీని పొందుపరిచారు.

జేడీఎస్

జేడీఎస్

రుణమాఫీ క్రెడిట్‌ను జేడీఎస్ కొట్టేస్తుందేమోనన్న కాంగ్రెస్‌ను కూడా ఆయన ఒప్పించి ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు.

ఈ పథకానికి

ఈ పథకానికి

గత డిసెంబర్ 31 లోపు రుణాలు తీసుకున్నవారు ఈ పథకానికి అర్హులు. రూ. 2లక్షల వరకు లోన్లు మాఫీ చేస్తారు. కొందరికి రూ.40 లక్షల వరకు కూడా వ్యవసాయ రుణాలున్నాయి.

ఈ నిర్ణయం

ఈ నిర్ణయం

అయితే, రూ.2 లక్షలను కటాఫ్‌గా పెట్టారు. పెద్ద పెద్ద లోన్లు కూడా రుణమాఫీలో చేర్చడం సరికాదన్న ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మొత్తం రుణమాఫీ కోసం రూ.34,000 కోట్ల ఖర్చవుతుందని తేల్చారు.

 రైతుల ఖాతాల్లో

రైతుల ఖాతాల్లో

అదే సమయంలో రుణాలు సరైన సమయంలో చెల్లించిన రైతులను కూడా ఆదుకుంటామని కర్ణాటక సీఎం ప్రకటించారు. రుణాలు సకాలంలో చెల్లించిన రైతుల ఖాతాల్లో రూ.25000 జమ చేస్తామన్నారు. ఒకవేళ అంతకంటే తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పారు.

ఉద్యోగులు

ఉద్యోగులు

మరోవైపు ప్రభుత్వ అధికారులు, కార్పొరేట్ సెక్టార్‌కు సంబంధించిన ఉద్యోగులు కూడా వ్యవసాయ రుణాలు తీసుకున్న వారిలో ఉంటే, ఈ పథకం వారికి వర్తించదని కుమారస్వామి స్పష్టం చేశారు.

ఎక్కువే కష్టపడాల్సి

ఎక్కువే కష్టపడాల్సి

గత మూడేళ్లుగా ఆదాయపన్ను చెల్లిస్తున్న రైతులు కూడా ఈ స్కీమ్ పరిధిలోకి రారని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా.ఈ రుణమాఫీకి నిధులు సంపాదించాలంటే కుమారస్వామి కొంచెం ఎక్కువే కష్టపడాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

రూ.34,000 కోట్ల

రూ.34,000 కోట్ల

అదే సమయంలో రూ.34,000 కోట్ల రైతు రుణమాఫీ.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమకు లాభిస్తుందని కాంగ్రెస్, జేడీఎస్ లెక్కలు వేస్తున్నాయి.

Read more about: kumaraswamy
English summary

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా కుమారస్వామి... రైతులు ఫుల్ ఖుషి ఏంటో చూడండి. | Good News to Karnataka Farmers From CM kumaraswamy

HD Kumaraswamy assured JDS leader that if they come to power, the farmers will make a loan. Despite being a small party in the Coalition government, it has maintained that promise.
Story first published: Monday, July 9, 2018, 9:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X