మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కువ మంది ప్రజలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.

ప్రధానమంత్రి
ఆర్థిక కార్యకలాపాలకు దూరంగా ఉన్నవారిని ఏదో విధంగా ఆర్థిక లావాదేవీలకు దగ్గర చేసేందుకు గాను ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన( పీఎంజేడీవై) పథకాన్ని ప్రవేశపెట్టారు

బ్యాంకు ఖాతాలు
ఈ పథకం ద్వారా దేశంలో ప్రతి పౌరుడికి బ్యాంకు ఖాతా ఉండేలా చూశారు. ఇప్పుడు అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండటంతో మరో ముందడుగు వేయబోతున్నారు.

ఉచిత
సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో బృహత్ ప్రణాళికను రచిస్తున్నారు. ఆగస్టు 15 నుంచి 50 కోట్ల మందిని(10 కోట్ల కుటుంబాలు) ఉచిత ప్రమాద బీమా పరిధిలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్వాతంత్ర దినోత్సవం
ఇప్పటికే ఈ ఏడాది బడ్జెట్లో సూచనప్రాయంగా దీని గురించి చెప్పినప్పటికీ ఇంత వరకూ దాని ఊసే లేదు. అయితే స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధాన మంత్రి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

జన్‌ధన్ ఖాతాలు
ప్రస్తుతం దేశంలో 32 కోట్ల మందికి జన్‌ధన్ ఖాతాలు ఉన్నాయి. వీరిలో 24 కోట్ల మంది రూపే కార్డులను వాడుతున్నారు. వారందరికీ రూ.1 లక్ష వరకూ ప్రమాద బీమా వర్తిస్తుంది

సంవత్సరానికి
ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకం ద్వారా మరికొంత మంది ప్రమాద బీమా పథకంలో చేరారు. సంవత్సరానికి రూ.12 చెల్లించి సురక్షా బీమా యోజన అనే ప్రమాద బీమా పథకంలో భాగస్వాములు అవ్వొచ్చు.

మూడు నెలల్లో
ఇదే విధంగా ప్రభుత్వమే ఆ రూ.12 చెల్లించి జన్‌ధన్ ఖాతాదారులందరికీ ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని అందించనుంది. మూడు నెలల్లో కనీసం ఒక్కసారైనా రూపే కార్డును వినియోగించి ఉండాలనే నిబంధనను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications