ఎయిర్ టెల్ యూజర్లకి బంపర్ ఆఫర్ ఏంటో చూడండి.
ఉచిత డేటా మరియు కాలింగ్ ఆఫర్లతో దేశాన్ని కుదిపేస్తున్న జియో దాటికి టెలికాం రంగంలో ఉన్న ప్రత్యర్ధులు తట్టుకోలేకపోతున్నారు. ఈ దాడిని తట్టుకోలేక మిగతా కంపెనీలు ఐడియా , ఎయిర్ టెల్ మరియు వోడాఫోన్ వినియోగదారులకి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

ముకేశ్ అంబానీ
నిన్న జరిగిన రిలయన్స్ వార్షికోత్సవంలో ముకేశ్ అంబానీ ఇచ్చిన బంపర్ ఆఫర్లకు ఎయిర్టెల్ అలర్ట్ ఐంది తమ బ్రాడ్ బ్యాండ్ వాడుతున్న వినియోగదారులు ఇక నుంచి ఉచిత డేటా అందుకుంటారు అని ప్రకటించింది.

చిన్న మెలిక
కానీ ఇందులో చిన్న మెలిక ఉంది ఈ ఆఫర్ కేవలం హైదరాబాద్ లో ఉన్న ఎయిర్ టెల్ వినియోగదారులకి మాత్రమే అని ప్రకటించింది కానీ కొన్ని రోజుల తర్వాత మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఎయిర్టెల్ వినియోగదారులకి అందించేలా చర్యలు తీసుకుంటాం అని చెప్పింది.

ప్రస్తుతం
ప్రస్తుతం హైదరాబాద్ లో ఎయిర్ టెల్ రూ.349 ప్లాన్ , రూ.499 ప్లాన్ రూ. 699 ప్లాన్ మరియు రూ.1299 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

రకరకాల ప్లాన్స్
దింట్లో రూ.349 ప్లాన్ లో 8 ఎంబీపీస్ స్పీడ్ తో రూ.499 ప్లాన్ లో 16 ఎంబీపీస్ స్పీడ్ తో మరియు రూ.699 ప్లాన్ లో 40 ఎంబీపీస్ స్పీడ్ తో , రూ.1299 ప్లాన్ తో 100 ఎంబీపీస్ స్పీడ్ తో అపరిత డేటా అందిస్తోంది.

తాజాగా ఎయిర్ టెల్
తాజాగా ఎయిర్ టెల్ తీసుకున్న ఈ నిర్ణయంలో పైన ఉన్న అన్ని డేటా ప్లాన్లకు ఈ బంపర్ ఆఫర్ వర్తిస్తుంది. ఇక లేట్ ఎందుకు ఎయిర్టెల్ వినియోదారులు ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications