ముకేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 41వ వార్షిక సర్వసభ్యసమావేశం నేపథ్యంలో వాటాదారులు, వ్యాపార వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ముకేష్ ప్రసంగం
ఈ సమావేశంలో ఈ మధ్యే ఆకాశ్ అంబానీతో ఎంగేజ్ అయిన శ్లోకా మెహతా.. ముకేశ్ అంబానీ తల్లి కోకిలా బెన్ పక్కన ఆశీనులయ్యారు.ఐపీవో జారీ తర్వాత ఈ మీటింగ్ జరుగుతున్నందున సహజంగానే ముకేష్ ప్రసంగంపై అన్నివర్గాల దృష్టిపడింది.

సభ్య సమావేశంలోని ముఖ్యాంశాలు
గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర లాభం మార్చి త్రైమాసికంలో 17% వృద్ది చెంది రూ.9459 కోట్లకు పెరిగింది. సంస్థ మొత్తం ఆదాయంలో 13% రిటైల్ రంగం ద్వారానే వస్తోందని ముకేశ్ అంబానీ వెల్లడించారు.

కన్సూమర్ బిజినెస్
ఇప్పటివరకూ, ఇకపై కూడా కన్సూమర్ బిజినెస్ పైన తమ దృష్టి కొనసాగుతుందని అంబానీ అన్నారు. ఇంధన, పెట్రోకెమికల్ వ్యాపారం తమకు చాలా ముఖ్యమని చెప్పారు.

పెట్రోకెమికల్
దేశ పెట్రోకెమికల్ ఎగుమతుల్లో 8.9% వాటాతో రూ. 1,76,000 కోట్లకు సమానమైన వ్యాపారాన్ని రిలయన్స్ నిర్వహిస్తోంది

రిలయన్స్ ఇండస్ట్రీస్
రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ కంపెనీల్లో అత్యధికంగా రూ. 9844 ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించింది. జియో ద్వారా వచ్చే రెవెన్యూ రూ. 69,000 కోట్లకు చేరింది. ఇది గతేడాదితో పోలిస్తే ఇది 100% ఎక్కువ.

21.0 కోట్లు వినియోగదారులు
ప్రస్తుతం రిలయన్స్ జియోలో 21.5 కోట్ల వినియోగదారులు ఉన్నారు
- కేవలం ఒక ఏడాది కాలంలో కస్టమర్లు రెండింతలు పెరిగారు.
- డేటా వినియోగం చూస్తే నెలకు 125 కోట్ల జీబీ నుంచి 240 కోట్ల జీబీకి పెరిగింది.
- మొబైల్స్‌లో వీడియో వీక్షణలు340కోట్ల గంటలకు పెరిగాయి.
- దేశవ్యాప్తంగా ప్రస్తుతం 7500 జియో స్టోర్లు ఉన్నాయి.
- జియో హెఎండ్ ఫోన్ (జియో ఫోన్2)
- టీవీ తెరలపై అల్ట్రా హై డెఫినిషన్ వినోదం
- లివింగ్ రూం నుంచే ఒకరి కంటే ఎక్కువ మందితో వీడియో కాన్ఫరెన్సింగ్
- వాయిస్ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్స్ (వాయిస్ కమాండ్లతో పనులు)
- వర్చువల్ రియాల్టీ గేమింగ్, డిజిటల్ షాపింగ్, ఇంకా ఎన్నో ఆకట్టుకునే సేవలు

ఈ రోజు సమావేశంలో
ఈ రోజు సమావేశంలో జియో ఫోన్‌లో హైఎండ్ వేరియంట్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఆకాశ్ అంబానీ జియో ఫోన్లో యూట్యూబ్, ఫేస్‌బుక్ వినియోగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో ప్రయోగపూర్వకంగా చూపారు.

జియో ఫీచర్ ఫోన్లో
ఇకపై జియో ఫీచర్ ఫోన్లో ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సప్ సేవలను పొందవచ్చు. ఆగస్టు 15 నుంచి అందుబాటులో ఉండనున్న ఈ ఫోన్ ధర రూ.2999

జియో ఫైబర్ బీటా సేవల
గత కొన్ని నెలలుగా ఎంపిక చేసిన నగరాల్లో జియో ఫైబర్ బీటా సేవల టెస్టింగ్ జరిగింది. ఇకపై జియో ఫైబర్ సేవలను ఇళ్లకు, వ్యాపారస్థులకు, చిన్న,మధ్య తరహా సంస్థలకు అందుబాటులోకి రానుంది. దాదాపు 1100 నగరాల్లో అత్యాధునిక, ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ సేవలను అందించనున్నట్లు ముకేశ్ అంబానీ వెల్లడించారు.

జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications