అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులను కలవరపాటుకు గురిచేస్తున్నారు. తన సంచలన - వివాదస్పద నిర్ణయాలతో ట్రంప్ ముందుకు సాగుతున్న తీరుతో విపరిణామాలు తప్పవని భారతీయ టెకీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లక్షమంది ప్రవాస
ఇదేవిషయం తాజాగా చేపట్టిన అధ్యయనంలో స్పష్టమైంది. అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో లక్షమంది ప్రవాస భారతీయులు కొలువులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అధ్యయనంలో పాల్గొన్న భారతీయ మూలాలున్న ఉద్యోగులు వెల్లడించారు.

హెచ్1 బీ వీసా
అమెరికాలో హెచ్1 బీ వీసా కలిగిన వృత్తినిపుణుల జీవిత భాగస్వామ్యులకు వర్క్ పర్మిట్ ను రద్దుచేయాలనే ఆలోచనతో ట్రంప్ సర్కార్ ఉందని వారు వాపోయారు.

బరాక్ ఒబామా
హెచ్1 బీ వీసా కలిగిన వృత్తినిపుణుల జీవిత భాగస్వామ్యులకు వర్క్ పర్మిట్ అవకాశాన్ని తాజా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కల్పించారు. అత్యంత నిపుణులైన వారి భాగస్వామ్యులకూ పని చేసే సౌకర్యం ఉంటే వారు అమెరికా వీడి వెళ్లకుండా ఉంటారన్న ఉద్దేశంతో ఒబామా సర్కార్ దీనిని అమల్లోకి తెచ్చింది.

ట్రంప్
అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ అన్న నినాదాన్ని అందిపుచ్చుకొని అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులు కొల్లగొట్టేస్తున్నారని ఆరోపిస్తూ వీసా నిబంధనలు కఠినతరం చేశారు.

అమెజాన్
అందులో భాగంగా హెచ్4 వీసాను రద్దు చేయడానికి అమెరికా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. వీసా నిబంధనలు కఠినతరం చేయాలన్న ట్రంప్ సర్కార్ ప్రణాళికలను గూగుల్ - అమెజాన్ - మైక్రోసాఫ్ట్ - ఫేస్ బుక్ వంటి సంస్థలు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయి

అమెరికా ప్రభుత్వం
అమెరికా ప్రభుత్వం తాజా ప్రణాళికలతో వేలాది ప్రవాస భారతీయుల కుటుంబాలపైనా - వారు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యాలపైన ప్రతికూల ప్రభావం పడుతుందని వాపోతున్నాయి.

వీసా
ఈనేపథ్యంలో ట్రంప్ సర్కార్ వీసా విధానాన్ని కఠినతరం చేస్తే కలిగే నష్టం గురించి టెన్యూనివర్సిటీకి చెందిన క్రిస్టోఫర్ జే.ఎల్. కన్నింగమ్ - యూనివర్సిటీ ఆఫ్ లైమ్రిక్లో కెమ్మి బిజినెస్ స్కూలుకి చెందిన పూజ బి విజయ్ కుమార్ లు 1800 మంది ప్రవాస భారతీయ కుటుంబాలతో మాట్లాడి ఓ అధ్యయన నివేదికను రూపొందించారు.

మహిళలే
ఆ అధ్యయన నివేదిక ప్రకారం లక్ష మంది వరకు ఉద్యోగాలు కోల్పోతుండగా.ఎక్కువ మంది మహిళలే ఉద్యోగాలు కోల్పోతారు. వర్క్ పర్మిట్ పొందినవారిలో 93 శాతం మంది మహిళలైతే ఏడు శాతం పురుషులు ఉన్నారు.

తట్టా బుట్టా
తాజా నిర్ణయంతో తట్టా బుట్టా సర్దుకునేందుకు భారతీయ ఉద్యోగుల భాగస్వామ్యులు రెడీ అవుతున్నారని సమాచారం
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications