సాధారణంగా ఏదన్నా టీవీ షో మొదలైంది అంటే అందులో పనిచేసే కంటెస్టెంట్స్ అందరు సెలెబ్రెటీలు అయిపోతారు. ఇక మెగా షోగా రన్ అవుతున్న బిగ్ బాస్ 2 కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ అందులో కొంతమంది మాత్రమే మనందరికీ తెలుసు.

కంటెస్టెంట్స్
యాంకర్ శ్యామల, గీతా మాధురి, టీవీ 9 యాంకర్ దీప్తి మరియు కౌశల్ మరియు యూ ట్యూబ్ చూసే వారు దీప్తి సునైనా అంటే గుర్తుపట్టారు ఇక హీరోగా కనిపించిన తనీష్ ఇప్పుడు పెద్దగా చేయడం లేదు.

ఇమేజ్
అయితే ఈ షోలో పాల్గొనే ముందే వాళ్లకొక ఉన్నవారు ఉన్నారు. పార్టిసిపేట్ చేసాక మరో ఇమేజ్ వస్తుంది. అందులో కౌశల్ ఒకడు. ఇతడు హ్యాండ్సమ్ మోడల్, యాక్టర్ కూడా మరియు ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు.

చక్రవాకం - సూర్యవంశం
చక్రవాకం , సూర్యవంశం వంటి సీరియల్స్ లో కౌశల్ గొప్ప నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు అలాగే కొన్ని సినిమాల్లో సపోర్ట్ యాక్టర్ గా చేసాడు. నిజానికి వాళ్ళ నాన్న కూడా యాక్టర్ అంటా.

పుట్టింది -పెరిగింది
ఇతడు పుట్టింది , పెరిగింది అంతా విశాఖపట్నంలోనే బీటేక్ మెకానికల్ లో మెటాలజి డిపార్ట్మెంట్ చదివాడు.

మోడల్ గా
చదివిన చదువుకి అనుగుణంగా ఉద్యోగం చేయాలనీ అనుకుంటుండగా మీరు అందంగా ఉన్నారుగా మోడల్ గా ట్రై చేయచ్చుగా అని కొందరు చెప్పారు. ఫలితంగా ఢిల్లీలో మోడలింగ్ పూర్తి చేసిన అతనికి వెంటనే అవకాశాలు చాలా వచ్చాయి.

వరుస యాడ్స్
వరుస యాడ్స్ లో బుక్ అయిన కౌశల్ ఢిల్లీలో జరిగిన మిస్టర్ ఇండియా పోటీలో అవార్డు సొంతం చేసుకున్నారు. అయితే యాంకర్ గా మనందరికీ తెలిసిన కౌశల్ నిజానికి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ద లుక్స్ ప్రొడక్షన్ నిర్వహిస్తున్న కౌశల్ కోట్లు సంపాదిస్తున్నాడు.

యాడ్స్
ఎన్నో బైక్ కంపెనీలు, మరియు కార్ల కంపెనీలు కౌశల్ కంపెనీకి వచ్చి ఇక్కడ వారి యాడ్స్ చేసుకుంటారు. అందుకే కౌశల్ కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడు.

మోడెలింగ్స్
ఫెయిర్ అండ్ లవ్లీ మరియు ల్యాక్ మీ యాడ్స్ అన్ని ఇక్కడే చేస్తారు అంటా.ఇలా పలు యాడ్స్ మోడెలింగ్స్ అందించిన ఘనత కౌశల్ కంపెనీదే.

కంపెనీకి ఫౌండర్
ఈ కంపెనీకి ఫౌండర్ మరియు ఎండీ కూడా కౌశల్ ఇతనికి నెలకి రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలు జీతం వస్తుంది.ఇక ఈ కంపెనీ ఎన్నో అవార్డులు మరియు రివార్డులు వచ్చాయి.


Click it and Unblock the Notifications