కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ఇటీవల ప్రారంభించిన పాస్‌పోర్ట్ సేవా మొబైల్ యాప్‌కు విశేష ఆదరణ లభిస్తోంది.

ఈ యాప్
ఈ యాప్ ప్రారంభించిన రెండు రోజుల్లోనే లక్ష మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని సుష్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

ఎక్కడినుంచైనా
ఈ యాప్ ద్వారా దేశంలో ఎక్కడినుంచైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సుష్మ తెలిపారు. జూన్ 26న ఆరో 'పాస్‌పోర్ట్ సేవా దివస్'ను పురస్కరించుకుని సుష్మ ఈ యాప్‌ను ప్రారంభించారు.

ఈశాన్య ప్రాంతంలో
ఈ యాప్ ద్వారా వలసదారులు తమ స్వస్థలాల నుంచే పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉంది. ఇప్పటివరకు ఈశాన్య ప్రాంతంలో గువాహటిలో మాత్రమే పాస్‌పోర్టు కార్యాలయం ఉంది.

కొత్త పాస్‌పోర్టు కేంద్రాలు
ఇప్పుడు కొత్త పాస్‌పోర్టు కేంద్రాలు ఈ ప్రాంతంలో పనిచేయనున్నాయని సుష్మ వెల్లడించారు. గత రెండు దశల్లో 251 పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్ కేంద్రాలను ప్రకటించాం.

మూడో దశలో
వాటిలో 212 ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మూడో దశలో మరో 38 రిజిస్ట్రేషన్ కేంద్రాలను అందుబాటులోకి తేనున్నట్లు ఆమె తెలిపారు.

ఇప్పటివరకు
ఇప్పటివరకు 260 వర్కింగ్ పాస్‌పోర్టు కేంద్రాలు ఉండగా, లోక్‌సభ నియోజవర్గ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకా ఏఏ ప్రాంతాల్లో పాస్‌పోర్టు కార్యాలయాలను ఏర్పాటు చేయాలో అధికారులు, విదేశాంగ శాఖ జాబితా తయారు చేస్తోందని తెలిపారు.

ఈ విధానం కింద
ఈ విధానం కింద పాస్‌పోర్ట్ దరఖాస్తు సమర్పించేందుకు రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం(ఆర్‌పీఓ), పాస్‌పోర్ట్ సేవా కేంద్ర(పీఎస్‌కే) లేదా పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్ర(పీఓపీఎస్‌కే)లలో దేన్నైనా ఎంచుకోవచ్చు.

నివాస స్థలం
ఎంచుకున్న ఆర్‌పీఓ పరిధిలో దరఖాస్తుదారుడి నివాస స్థలం లేకున్నా కూడా అప్లికేషన్ పంపొచ్చు.

దరఖాస్తు ఫారంలో
దరఖాస్తు ఫారంలో పేర్కొన్న చిరునామాలోనే పోలీసు ధ్రువీకరణ జరుగుతుంది. పాస్‌పోర్టు మంజూరు అయిన తరువాత.. సదరు ఆర్‌పీఓనే దరఖాస్తులోని చిరునామాకు దాన్ని పంపుతుంది
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications