జియో రాకతో తక్కువ ధరల్లో డేటా అందించి టెలికాంలో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ మరో సంచలనానికి తెరతీయనున్నారు.

మొబైల్ డేటాతో కొడితే
అప్పుడు మొబైల్ డేటాతో కొడితే ఈసారి హోం బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో రిలయన్స్ జియో ప్రవేశించనుంది. దీన్ని ఫైబర్ టు ది హోం(FTTH)గా చెబుతున్నారు.

బ్రాడ్ బ్యాండ్
ఇంటింటికీ వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ అందించడమే దీని లక్ష్యం అని అంటున్నారు. ప్రారంభంలో 100 ఎంబీపీఎస్ వేగంతో ఉచిత ప్యాకేజీలతో హోం బ్రాడ్‌బ్యాండ్ రాబోతోంది. ఇందులో వీడియోలు, అపరిమిత వాయిస్ కాల్స్(వీఓఐపీ) వంటి వాటిని అదనపు ఆకర్షణలుగా ప్రవేశపెట్టబోతున్నారు.

ఎఫ్‌టీటీహెచ్ టెక్నాలజీని మొదట తీసుకొచ్చింది జియోనేనా?
దీన్ని మొదట తీసుకొస్తుంది జియోనేమీ కాదు. కోల్‌కత, చెన్నై నగరాల్లో బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే ఈ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. అయితే విస్తృత స్థాయిలో ఒకేసారి ఈ టెక్నాలజీతో జియో టెలికాం బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ప్రవేశిస్తోంది. ఇప్పటికే ఎంపిక చేసిన నగరాల్లో జియో పైలట్ ప్రాజెక్టు నడుస్తోంది

దీని ప్రభావం ఎలా ఉంటుంది?
హోం బ్రాడ్‌బ్యాండ్‌లో ధరల ప్రభావం ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉంది. ఇది మారుతుంది.
దీని రాకతో పోటీదారులు(ముఖ్యంగా ఎయిర్టెల్) ధరలను చాలా వరకూ తగ్గించే వీలుంది.
ఎన్నో సేవలను బ్రాడ్‌బ్యాండ్ సాయంతో అందించే ప్రణాళిక ఉన్నందున వివిధ మొబైల్ సేవలపై సైతం ప్రభావం ఉండొచ్చని టెలికాం రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫైబర్ టు ది హోం(FTTH) అంటే?
ఇన్ని రోజులు హోం బ్రాడ్‌బ్యాండ్ కావాలంటే అప్పటికప్పుడు జంక్షన్ బాక్స్ నుంచి కేబుల్ లాగి అవసరమైనప్పుడు మాత్రమే కనెక్షన్ అందించేవారు. ఇప్పుడు రిలయన్ప్ జియో ప్లాన్ ఏంటంటే ఇంటి వరకూ నేరుగా ఫైబర్ కేబుల్ వేస్తారు. ఇప్పటివరకూ ఉన్నదానికి దీనికి తేడా ఏంటంటే ముఖ్యమైన స్థలానికి మాత్రమే ఇన్ని రోజులు ఫైబర్ కేబుల్ వచ్చి, తర్వాత కాపర్ కేబుల్ వేసేవారు. ఇప్పుడు మొత్తం ఫైబర్ కేబులే.

ఈ టెక్నాలజీ ఎందుకు వేగంగా ఉంటుంది?
మన వ్యక్తిగత కనెక్షన్లకు మొత్తం ఫైబర్ కేబుల్ ఉపయోగించేవారు కాదు. అయితే మామూలు కేబుల్‌కు, ఫైబర్ కేబుల్‌కు తేడా ఉంటుంది. ఫైబర్ కేబుల్లో డేటా ప్రసారం వేగంగా ఉంటుంది. ఈ టెక్నాలజీలో ఉండే ఫైబర్ కేబుల్ ద్వారా నాణ్యతతో పాటు వేగం ఎక్కువ సాధ్యమవుతుంది.
సంప్రదాయ కనెక్షన్లతో పోలిస్తే ఎఫ్‌టీటీహెచ్ టెక్నాలజీలో 100 రెట్లే వేగంగా డేటా ప్రసారం జరుగుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications