ప్రపంచంలో టాప్ కంపెనీలు వాటి విలువ రూ.1360 లక్షల కోట్లు
ప్రపంచంలోని టాప్ 100 కంపెనీల ఉమ్మడి మార్కెట్ విలువ 20 లక్షల కోట్ల డాలర్లకు (రూ.1360 కోట్లు) చేరింది. అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పిడబ్ల్యుసి టాప్ 100లో ఉన్న కంపెనీల జాబితాను ప్రకటించింది.

ఒక్క భారత కంపెనీ
ఈ జాబితాలో ఒక్క భారత కంపెనీకి కూడా స్థానం దక్కలేదు. 2017 సంవత్సరంతో పోల్చితే మార్కెట్ విలువలో 66 శాతం వృద్ధి సాధించి 27800 కోట్ల డాలర్ల విలువతో అమెజాన్ టాప్‌లో ఉంది.

చైనా కంపెనీలు
చైనా కంపెనీలు టెన్సెట్, అలీబాబా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అలీబాబా మార్కెట్ విలువ 75 శాతం పెరిగి 20100 కోట్ల డాలర్లుంది. మైక్రోసాఫ్ట్, అల్ఫాబెట్, యాపిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

టాప్ 10 కంపెనీల్లో
ఈ జాబితాలోని టాప్ 10 కంపెనీల్లో పింగ్ యాన్ ఇన్సూరెన్స్, ఐసిబిసి, బోయింగ్‌లకు స్థానం దక్కింది. వరుసగా నాలుగో సంవత్సరంలో కూడా ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉంది.

అమెరికన్ కంపెనీల సంఖ్య
గత ఏడాదితో పోల్చితే అమెరికన్ కంపెనీల సంఖ్య మాత్రం 55 నుంచి 54కి తగ్గింది. మార్కెట్ విలువపరంగా వాటా కూడా గత ఏడాదితో పోల్చితే 63 శాతం నుంచి 61 శాతానికి తగ్గింది.

బలమైన ఆర్థిక
టెక్నాలజీలో అగ్రగాములుగా ఉండడం, బలమైన ఆర్థిక పరిస్థితులు అమెరికా కంపెనీలు అత్యధిక వాటా పొందడానికి కారణమని పిడబ్ల్యుసి ఆ నివేదికలో పేర్కొంది. 12 కంపెనీలతో ఈ జాబితాలో చైనా రెండో స్థానంలో ఉంది.

యాపిల్
చైనా కంపెనీల మార్కెట్ విలువ వాటా 57 శాతం మేరకు పెరిగింది. విలువలో వృద్ధిపరంగా యాపిల్ ఆరో స్థానంలో నిలిచినా వరుసగా ఏడో సంవత్సరంలో కూడా మార్కెట్ విలువలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

షేర్ల కొనుగోలు
ఏ ఇతర కంపెనీ కన్నా యాపిల్ డివిడెండ్లు, షేర్ల కొనుగోలు రూపంలో తన ఇన్వెస్టర్లకు పెట్టుబడిపై మెరుగైన లాభాలందించడంలో తొలి స్థానంలో ఉంది.

పెట్టుబడి
ఈ కంపెనీ 2016 సంవత్సరంలో వాటాదారులకి పెట్టుబడిపై అందించిన రాబడుల విలువ 2900 కోట్ల డాలర్లుంది.

టాప్ 3 స్థానాలు
మార్కెట్ విలువపరంగా టెక్నాలజీ రంగం అగ్రస్థానంలో ఉంది. అంతర్జాతీయ టాప్ 3 స్థానాలు కూడా టెక్నాలజీ కంపెనీలకే దక్కాయి. యాపిల్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ ఆ స్థానాలను ఆక్రమించాయి.


Click it and Unblock the Notifications