ఎయిర్ టెల్ కు మరో భారీ షాక్ ఏంటో మీరే చూడండి.
వినియోగదారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే వారి ఖాతాలను ఏర్పాటు చేసిన విషయంలో భారతీ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు భారీ షాక్ తగిలింది.

కొత్త ఖాతాదారులను
ఈ నేపథ్యంలోనే కొత్త ఖాతాదారులను చేర్చుకోవడానికి వీలు లేదని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆంక్షలు విధించింది. మార్గదర్శకాల ఉల్లంఘన నేపథ్యంలో కంపెనీపై దర్యాప్తు చేస్తున్నందున కొత్త రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని కేంద్ర బ్యాంకు ఆదేశించినట్లు తెలిపింది.

ఈ విషయాన్ని
ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ కూడా ధ్రువీకరించింది. 2018 జనవరి జనవరి 5 నుంచే ఈ నిషేధం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

వంటగ్యాస్‌పై
వినియోగదారులకు సమాచారం లేకుండానే వారి ఖాతాలను తెరిచి అందులో వంటగ్యాస్‌పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని జమ చేసింది. లబ్ధిదారుల రెగ్యులర్ బ్యాంక్ ఖాతాల్లో కాకుండా తన పేమెంట్స్ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకుంది.

30 లక్షల ఖాతాలు
ఖాతాదారుల అనుమతి లేకుండా దాదాపు 30 లక్షల ఖాతాలు తెరిచింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో జనవరి 15న ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుకు ఆర్‌బీఐ నోటీసులు జారీ చేసింది.

ఆర్‌బీఐ
ఈ కేసులో నో యువర్ కస్టమర్(కెవైసి) ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించడంతో మార్చిలోనే ఈ సంస్థ 5 కోట్ల రూపాయల మేర భారీ జరిమానాకు గురైంది.

ఉల్లంఘనపై
ఈ ఉల్లంఘనపై ప్రస్తుతం కంపెనీపై దర్యాప్తు చేస్తున్నందున రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆదేశించినట్లు ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు.


Click it and Unblock the Notifications