రైలు ప్రయాణికుల దాహార్తి తీర్చడానికి IRCTC అద్భుత ప్రయోగం?

స్టేట్ అఫ్ ఆర్ట్ వాటర్ ఎటిఎంలు ప్రస్తుతం దేశం లోని 100 స్టేషన్లలో అందుబాటులోకి వచ్చాయని వీటిద్వారా ప్రయాణీకులకు అతి తక్కువ ధరకే శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తున్నట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

న్యూఢిల్లీ: స్టేట్ అఫ్ ఆర్ట్ వాటర్ ఎటిఎంలు ప్రస్తుతం దేశం లోని 100 స్టేషన్లలో అందుబాటులోకి వచ్చాయని వీటిద్వారా ప్రయాణీకులకు అతి తక్కువ ధరకే శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తున్నట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

రైలు ప్రయాణికుల దాహార్తి తీర్చడానికి IRCTC అద్భుత ప్రయోగం?

భారతీయ రైల్వే టూరిజం అండ్ క్యాటరింగ్ కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) గత సంవత్సరం వాటర్ టెక్నాలజీ వెంచర్, స్వజల్ తో ముడిపడి ఉంది. 14 రాష్ట్రాలలో 104 రైల్వే స్టేషన్లలో నీటిని సరఫరా చేస్తుంది. ఈ 104 రైల్వే స్టేషన్లలో 30 శాతం అధిక ప్రయాణికులు ఉండే కేంద్రాలు మిగతా 70 శాతం గ్రామీణ కేంద్రాలు.

ఈ పథకం కేంద్ర బడ్జెట్ 2016 లో చేర్చబడింది మరియు దేశవ్యాప్తంగా 40,000 ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఉంది. స్టేషన్ ప్రాంగణంలో వారి నీటి సీసాలు నింపే మరియు ఖరీదైన ప్యాక్ చేసిన నీటిని కొనుగోలు చేసే ప్రయాణీకులకు నీటి ఎటిఎంలు ఉపయోగపడతాయి.అదేవిదంగా ఈ ATM లు ప్లాస్టిక్ లేని పదార్థాలను ప్రోత్సహించటంతో పాటు, ప్లాస్టిక్ వినియోగం కూడా తతగ్గిపోతుందని అధికారి తెలిపారు.

దీని వల్ల ప్రయాణికులు పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల ఉపయోగం తగ్గుతుందని,వాటర్ ATM లలో కప్పులో నీటిని అందిస్తుందని మరియు వారు తెచ్చుకున్న సొంత సీసాల్లో నీటిని తీసుకువెళ్లే అవకాశం కల్పిస్తుందన్నారు.

ఈ ఎటిఎమ్లలోని ఒక లీటరు కు రూ .5 రూపాయలు ఖర్చవుతుంది. ప్రయాణీకులు చెల్లింపు కోసం BHIM అప్లికేషన్ లేదా Paytm ఉపయోగించవచ్చు, లేదా స్వాజల్ కార్డ్ పొందిన కూడా ప్రతి రైల్వే స్టేషన్లో నీటిని పొందవచ్చు.

2017 లో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణీకులకు సులభంగా అందుబాటులో ఉండే స్వచ్ఛమైన త్రాగునీటిని తయారు చేయటానికి భారత రైల్వేస్తో ఒక భాగస్వామ్యంలోకి ప్రవేశించామన్నారు. ఈ ఏడాది ఇప్పటికే 100 రైల్వే స్టేషన్లలో అమల్లో ఉంచామని, 2019 నాటికి తాము 1,000 రైల్వే స్టేషన్లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం 'అని స్వాజాల్ ప్రతినిధి విబా త్రిపాఠి అన్నారు.

మిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ప్రాంతాలలో నీటి ఎటిఎంలు ఇప్పటివరకు విస్తరించాయి.

దాని నీటి సాంకేతికత పది వడపోత దశలలో నీటిని శుద్ధి చేస్తుంది మరియు కొన్ని ప్రాంతాల్లో గంటకు 10,000 లీటర్ల వరకు నీరు పంపిణీ చేస్తుంది. 300 ml, 500 ml, 1 లీటరు, 2 లీటర్లు మరియు 5 లీటర్ల నీటిని కూడా వారు అందిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+