రైతుబంధు పథకం క్రింద రైతులకి ఇంత సొమ్ము అందిందా? మీరే చూడండి.
రైతుబంధు పథకం కింద తొలివిడత సాయం దాదాపుగా రైతులకు అందింది. రైతన్నలకు పంట పెట్టుబడికి సాయం అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా మే 10న చెక్కుల పంపిణీని ప్రారంభించింది.

దాదాపు
అప్పటి నుంచి సోమవారం (మే 25) నాటికి. అంటే గత ఆరు వారాల్లో బ్యాంకుల నుంచి దాదాపు రూ. 4,900 కోట్లు పెట్టుబడి సాయం కింద రైతులు డ్రా చేసుకున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఇంత భారీ మొత్తం బ్యాంకుల నుంచి రైతుల చేతుల్లోకి వెళ్లడాన్ని ఆల్‌టైమ్ రికార్డుగా చెబుతున్నారు.

రైతుబంధు
నోట్లరద్దు నిర్ణయం తర్వాత ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఖాతాదారులకు నగదు కష్టాలు వేఽధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ‘రైతుబంధు' లబ్ధిదారులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగదు అందజేయాలని బ్యాంకులకు ప్రభుత్వం ముందే స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అటు లబ్ధిదారులకు కూడా చెక్కులను మార్చుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు.

ఎకరానికి
రైతుబంధు కింద ఏడాదిలో ఎకరానికి రూ.8వేల చొప్పున రెండు విడతలుగా పెట్టుబడి సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.12వేల కోట్లు కేటాయించింది

రాష్ట్రవ్యాప్తంగా
పునాస సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 10.558 గ్రామాల్లోని 58 లక్షల మంది రైతులకు పంపిణీ చేసేందుకు 57.88 లక్షల చెక్కులను ప్రింట్ చేయించింది. 47.17 లక్షల చెక్కులు పంపిణీ అయ్యాయి.

రైతులకు
సోమవారం నాటికి 40.94 లక్షల చెక్కులను రైతులు విడిపించుకున్నట్లు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారధి కాగా నాగర్‌కర్నూల్ జిల్లాలో గత ఆరు రోజుల్లోనే రూ.122 కోట్లు రైతులకు అందాయి.

ఇతర దేశాలకు
తొలి విడత రైతుబంధు చెక్కుల పంపిణీ, విత్‌డ్రా సజావుగా జరుగుతున్నా.. ఇతర దేశాలకు వెళ్లినవారు. ఉపాధి కోసం గల్ఫ్‌లో ఉన్నవారు.సైన్యంలో పనిచేస్తున్నవారు.వివిధ కారణాల వల్ల దూర ప్రాంతంలో ఉన్నవారి చెక్కులు అధికారుల వద్దే ఉండిపోయాయి. దీంతో దాదాపు 16.94 లక్షల చెక్కులు పంపిణీ కాకుండా మిగిలిపోయాయి.


Click it and Unblock the Notifications