వరుసగా ఆరో రోజూ దేశవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గాయి. పెట్రోల్ ధరలు ఢిల్లీ, కోల్‌కత్తాలో 14 పైసలు, ముంబైలో 18 పైసలు, చెన్నైలో 15 పైసలు చొప్పున తగ్గినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటాలో వెల్లడైంది. మంగళవారం తగ్గిన అనంతరం, లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.75.55గా, కోల్‌కత్తాలో రూ.78.23గా, ముంబైలో రూ.83.12గా, చెన్నైలో రూ.78.40గా ఉంది. పెట్రోల్ ధరలతో పాటు నేడు డీజిల్ ధరలు కూడా ఢిల్లీ, చెన్నై, కోల్‌కత్తాలో 10 పైసలు, ముంబైలో 12 పైసలు తగ్గాయి. తాజా ధరల సమీక్ష ప్రకారం లీటరు డీజిల్ ధర ఢిల్లీలో రూ.67.38గా, కోల్‌కత్తాలో రూ.69.93గా, ముంబైలో రూ.71.52గా, చెన్నైలో రూ.71.12గా నమోదైంది.

గరిష్ట స్థాయిల్లో ఎగిసిన ఇంధన ధరలు, మే 30 నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. అప్పటి నుంచి పెట్రోల్ ధరలు రూ.2.88 తగ్గగా.. డీజిల్ ధరలు రూ.1.93 క్షీణించాయి. అయితే అంతర్జాతీయంగా మాత్రం క్రూడ్ ఆయిల్ ధరలు ప్రస్తుతం పెరుగుతున్నాయి. లిబియాన్ ఇంధన ఎగుమతులపై అనిశ్చితి నెలకొనడంతో, అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ అంతర్జాతీయ బెంచ్ మార్క్ వద్ద 0.3 శాతం పెరిగి బ్యారల్‌కు 74.95 డాలర్లుగా నమోదైంది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications