రిలయన్స్ జియో మరో సంచలన సర్వీసులను కమర్షియల్‌గా లాంచ్ చేయబోతుంది. అవే జియోలింక్ సర్వీసులు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న జియోలింక్ సర్వీసులపై బంపర్ ఆఫర్ ప్రకటించింది.

జియోలింక్
తన జియోలింక్ సబ్‌స్క్రైబర్ల కోసం మూడు కొత్త ప్లాన్లను లాంచ్ చేస్తున్నట్టు రిలయన్స్ జియో తెలిపింది. అవే 699 రూపాయలు, 2099 రూపాయలు. 4199 రూపాయల ప్యాకేజీలు. ఈ ప్యాకేజీలన్నింటిపై రోజుకు 5జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు రిలయన్స్ జియో తెలిపింది. ఈ ప్యాక్‌లపై ఎలాంటి కాలింగ్ ప్రయోజనాలు ఉండవు.

తొలి ప్లాన్
తొలి ప్లాన్ కింద 699 రూపాయలపై 5జీబీ 4జీ డేటాను కంపెనీ అందిస్తోంది. ఈ ప్లాన్‌వాలిడిటీ 28 రోజులు. కేవలం 5 జీబీ డేటా మాత్రమే కాకుండా 16 జీబీ అదనపు డేటాను జియో ఆఫర్ చేస్తోంది

మొత్తంగా నెలకు
అంటే మొత్తంగా నెలకు 156 జీబీ డేటాను యూజర్లు పొందుతారు. ఇక రెండో ప్లాన్ కింద పైన పేర్కొన్న ప్రయోజనాలే 98 రోజుల పాటు అందనున్నాయి. రోజుకు 5 జీబీ డేటా, ఈ ప్లాన్‌పై అదనంగా 48 జీబీ డేటాను 4జీ స్పీడులో యూజర్లకు జియో ఆఫర్ చేయనుంది. దీంతో మొత్తంగా 98 రోజుల పాటు 538 జీబీ డేటాతో యూజర్లు పండుగ చేసుకోవచ్చు.

ఈ ప్లాన్
సగం వార్షిక ప్రాతిపదికన మూడో ప్లాన్‌ను జియో ఆవిష్కరించింది. అది 4,199 రూపాయల ప్లాన్. ఈ ప్లాన్ 196 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాక్‌పై కూడా రోజుకు 5 జీబీ డేటాను, అదనంగా 96 జీబీ డేటాను యూజర్లు పొందవచ్చు. అంటే మొత్తంగా యూజర్లు 1076 జీబీ డేటాను పొందనున్నారు.

మూడు ప్యాక్‌లపై
ఈ మూడు ప్యాక్‌లపై జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ ను పొందవచ్చు. మంచి నెట్‌వర్క్ ఉండి కూడా సమస్యలు ఎదుర్కొనే వారికి జియోలింక్ సర్వీసులు ఎంతో ఉపయోగకరం.

జియో లింక్ సర్వీసులు
ప్రస్తుతం జియో లింక్ సర్వీసులు కమర్షియల్‌గా ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇవి టెస్టింగ్ దశలో ఉన్నట్టు తెలిసింది. త్వరలోనే ఈ సర్వీసులను కూడా రిలయన్స్ జియో కమర్షియల్‌గా లాంచ్ చేయబోతుంది.

వైర్డ్ కనెక్షన్‌లో
జియోలింక్ డివైజ్ హాస్పాట్ డివైజ్ కంటే ఎక్కువ. వైర్డ్ కనెక్షన్‌లో ఎలాంటి పరిమితులు లేకుండా.. హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సస్‌ను అందించడమే జియోలింక్ డివైజ్ ఉద్దేశం.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications