ఈ అవ్వ 3 వేల కోసం ఎంత సాహసం చేసిందో తెలిస్తే మనకు కన్నీళ్లు ఆగవు?

పాతకాలంలో మీరు సతి సావిత్రి కథ వినే ఉంటారు ఆమె భర్త ప్రాణాలు కాపాడుకోడం కోసం యముడితోనే పోరాడి తన మంగళ్యాన్ని కాపాడుకుంది ఈ కాలం లో కూడా అచ్చం అదే తరహాలో ఒక 65 ఏళ్ల ఒక వృద్దురాలు.

పాతకాలంలో మీరు సతి సావిత్రి కథ వినే ఉంటారు ఆమె భర్త ప్రాణాలు కాపాడుకోడం కోసం యముడితోనే పోరాడి తన మంగళ్యాన్ని కాపాడుకుంది ఈ కాలం లో కూడా అచ్చం అదే తరహాలో ఒక 65 ఏళ్ల ఒక వృద్దురాలు తన భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు ఎంత సాహసం చేసిందో మిరే చూడండి..

మహారాష్ట్ర:

మహారాష్ట్ర:

వివరాల్లోకి వెళితే మహారాష్ట్ర లోని బల్తానా జిల్లాకు చెందిన ఒక చిన్న గ్రామంలో లతా భగవాన్ కారే తన భర్తతో కలిసి ముగ్గురు ఆడపిల్లతో నివాసం ఉండేది.వారిద్దరూ కాయా కష్టం చేసి ముగ్గు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తవారి ఇంటికి పెంపించేసారు.

కూతుళ్ళ పెళ్లి కోసం:

కూతుళ్ళ పెళ్లి కోసం:

ఒక నీరు పేద ఇంట్లో ముగ్గురు పెళ్లిళ్లు వెంట వెంటనే చేయాలంటే అది అసాధ్యం అనే చెప్పాలి కానీ లతా దంపతులు తాము కష్టించి పోగు చేసుకున్న డబ్బు తో పాటు అప్పులు చేసి మరి ముగ్గురి కూతుళ్ళ పెళ్లిళ్లు సజావుగా జరిపించారు,ఫలితంగా అప్పులు బాగా పెరిగాయి.

అనుకోని విపత్తు :

అనుకోని విపత్తు :

పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు ఎలాగయినా తీర్చేయాలని దంపతులు నిశ్చయించుకున్నారు మరి కష్టం చేయడం మొదలుపెట్టారు మనం అనుకున్న వన్నీ జరిగితే జీవితం ఎందుకవుతుంది,సరిగ్గా అదే సమయం లో వారికి అనుకోని విపత్తు ఎదురయినది.

భర్త ఆరోగ్యం:

భర్త ఆరోగ్యం:

ఉన్నట్టుండి ఒక రోజు తన భర్త తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు,వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు లతకు నివ్వరపోయే వార్త చెప్పారు,తన భర్త వొంట్లో ఇన్ఫెక్షన్ సోకిందని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.ఈ వార్త విన్న ఆమె తల్లడిల్లిపోయింది ఇంత కాలం తన భర్త తనకు తోడు నిండగా ఉన్నాడు తనకు ఏమవుతుందో అని రోదించింది.

భర్తను ఎలాగైనా కాపాడుకోవాలని:

భర్తను ఎలాగైనా కాపాడుకోవాలని:

తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలని ఉద్హేశంతో చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా చుట్టు పక్కన వారితో కొంత డబ్బు పోగుచేసి తన భర్తను వెంటనే ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది.ఇక అక్కడ తన భర్తకు చేయాల్సిన టెస్టులకు సంబంధించి పరికరాలు లేకపోవడంతో అతడిని బారామతి ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది.

ఆసుపత్రి లో వైద్యులు:

ఆసుపత్రి లో వైద్యులు:

అక్కడ వైద్యులు తన భర్తకు అత్యవసర పరీక్షలు చేయాలనీ చెప్పగా ఆమె దుఃఖం పెల్లుబికింది,ఏమి చేయాలో అర్థం కానీ అయోమయ పరిస్థితిలో పడిపోయినది.ఆ టెస్టులు చేయించడానికి సరిపడా డబ్బులు ఆమె వద్ద లేదు,పరిస్థితి పూత పూటకు దిగజారి పోతోంది.తన భర్త వైపు చూసి నిస్సహాయ స్థితిలో రోదించసాగింది.తనను ఎలాగైనా కాపాడుకోవాలని తనకి తేలిన వారితో మరియు బంధువులతో కొంగు చాచి మరి డబ్బు అడిగింది.

కొంత డబ్బు పోగు చేసింది:

కొంత డబ్బు పోగు చేసింది:

తన పరిస్థితి అర్థం చేసుకున్న కొందరు తమకు చేతనయినంత సహాయం చేశారు,ఇక వైద్యులు అతడిని లోపలి తీసుకెళ్లగా ఆమె అక్కడే బయట కూర్చొని భగవంతుడిని తేలుకుంటు తన ఇంటి దీపాన్ని కాపాడు అని ప్రార్ధించింది.అదేసమయం లో వైద్యులు ఆమె వద్దకు వచ్చి అతడికి చేసిన టెస్టులు సరిపోవని ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలనీ డబ్బు ఇంకా కావాలని డబ్బు లేనిదే ససేమిరా అని చెప్పారు.

ఖరీదయిన టెస్టులు:

ఖరీదయిన టెస్టులు:

తన భర్తకు ఎలాగయినా ఖరీదయిన టెస్టులు చేయించాలని కానీ అదెలా సాధ్యం అని ఆలోచిస్తూ ఉండిపోయింది,తన భర్త ఆకలి అడగగా తనతో ఉన్న కొంత చిల్లర డబ్బుతో రెండు సమోసాలు తెచ్చింది,తాను తెచ్చిన సమోసాలకి చుట్టిన పేపర్ లో మరాఠీలో రాసిఉన్న ఒక ప్రకటన చదివింది.

పేపర్ ప్రకటన:

పేపర్ ప్రకటన:

భారమతి మారథాన్ కి సంబంధించి రాసిన ప్రకటన అది,అందులో ఏముంది అంటే మారథాన్ లో పాల్గొనండి 3 వేలు గెలుపొందండి అని ఉంది.అది చ్చోసి లతా రాత్రంతా ఆలోచిస్తూ ఎలాగైనా అందులో పాల్గొని 3 వీలు సొంతం చేసుకోవాలని అనుకుంది.

మరుసటి రోజు:

మరుసటి రోజు:

మరుసటి రోజు వెంటనే పరుగు పరుగున భారమతి మారథాన్ మొదలయ్యే ప్రదేశానికి చేరుకుంది,అందరు క్రీడల దుస్తులు ధరించి మూడు కిలోమీటర్ల పరుగులో పాల్గొనడానికి అందరు సిద్హంగా ఉన్నారు,కానీ లతమ్మా తొమ్మిది గజాల నేత చీర కట్టుకొని ఉంది.

మారథాన్ నిర్వహించే సిబ్బంది వద్దకు వెళ్లి తాను కూడా ఈ పరుగులో పాల్గొంటా అని అడగగా వారు ససేమిరా అన్నారు,ఆమె వారిని ప్రాధేయపడగా చివరకు అంగీకరించారు,అందరు ఆమెను చూసి పిచ్చిది అని నవ్వసాగారు.

పరుగు పోటీలో విజయం:

పరుగు పోటీలో విజయం:

ఆమె కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేవు అందులోనూ ఆమె వయసు సుమారు 65 ఏళ్ళ కు పైన ఉంటుంది,అవేమి లెక్క చేయకుండా లతమ్మ పోటీలో దిగింది కాళ్లకు రాళ్లు గుచ్చుకుంటున్న పట్టించుకోక తన లక్ష్యం పందెం గెలిచి ఆ డబ్బుతో తన భర్తను కాపుడుకోవాలని దృఢ నిశ్చయంతో పరుగెత్త సాగింది.

తన వయసును కూడా లెక్క చేయకుండ అక్కడ ఉన్న వారందరు ఆశ్చర్యపోయేలా లతమ్మ 3 కిలోమీటర్ల పందెం గెలిచింది,అందరు ఆమె సాహసానికి మెచ్చి చప్పట్లతో ప్రశంసించారు.అందుకే అంటారు మనిషి గొప్ప సంకల్పంతో చేస్తే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుందని.

యావత్ దేశం:

యావత్ దేశం:

లతా చేసిన సాహసం యావత్ దేశం మొత్తం తెలిసి అందరు ప్రశంసలు కురిపించారు,తన భాద తెలుసుకొని చాలా మంది దాతలు తన ఖాతాకు డబ్బు పంపడం మొదలుపెట్టేరు ఆలా పంపిన డబ్బు మొత్తం లక్షా 75 వీలు పోగయ్యాయి.దాంతో ఆమె తన భర్తకు చికిత్స అందించి ప్రాణాలు కాపాడుకోడమే కాక అప్పులు అన్ని తీర్చేసి ఆనందంగా జీవించడం మొదలుపెట్టారు.

65 ఏళ్ళు ఉన్న లతా తన భర్త ను కాపాడుకోవాలని వయసును సైతం లెక్క చేయక ప్రాణాలకు తెగించి చేసిన సాహసం ప్రతి ఒక్కరికి ఆదర్శ కరం అని చెప్పక తప్పదు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+