For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరుసగా మూడవ రోజు తగ్గిన పెట్రోల్ ధరలు ఎంతో చూడండి.

రెండు రోజులు తగ్గుతూ వచ్చిన పెట్రోల్ ధరలు శనివారం మూడోరోజు కూడా తగ్గింది. మెట్రో నగరాల్లో పెట్రోలు ధరలు లీటరుకు 9 నుండి 13 పైసలకు తగ్గింది.

|

రెండు రోజులు తగ్గుతూ వచ్చిన పెట్రోల్ ధరలు శనివారం మూడోరోజు కూడా తగ్గింది. మెట్రో నగరాల్లో పెట్రోలు ధరలు లీటరుకు 9 నుండి 13 పైసలకు తగ్గింది. ఢిల్లీలో 9 పైసలు, కోల్కతాలో 9 పైసలు, ముంబయిలో 13 పైసలు తగ్గాయి. చెన్నైలో ధరలు 9 పైసలు పడిపోయాయి. తాజా ధరల తగ్గింపు తరువాత ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరు రూ. 75.93,కోలకతాలో రూ. 78.61 ముంబైలో రూ.83.61 ,చెన్నైలో రూ78.80 రూపాయలు.

వరుసగా మూడవ రోజు తగ్గిన పెట్రోల్ ధరలు ఎంతో చూడండి.

అదేవిధంగా డీజిల్ ధరలు మెట్రో నగరాల్లో 7 నుండి 12 పైసల వరకు తగ్గించబడ్డాయి. ఢిల్లీ, కోల్కతాల్లో 7 పైసలు తగ్గించాయి. ముంబైలో డీజిల్ ధరలు 12 పైసలు, చెన్నై లో 8 పైసలు తగ్గాయి.

ధరల తగ్గింపు తరువాత డీజిల్ ధర ఢిల్లీలో రూ.67.61 రూపాయలు. కోల్కతాలో రూ.70.16 రూపాయలు. ముంబైలో రూ.71.87 రూపాయలు మరియు చెన్నైలో రూ.71.36. శుక్రవారం పెట్రోల్ ధరలు 18 పైసలకు తగ్గించబడ్డాయి.

గత కొన్ని రోజులుగా, పెట్రోల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఉదాహరణకు, గత వారంలో, నగరంపై ఆధారపడి 39 నుండి 57 పైసలు వరకు ధరలు తగ్గించబడ్డాయి. గత రెండు వారాలలో పెట్రోలు ధరలు రూ. 1.07 నుండి రూ. 1.15 దాక తగ్గించబడ్డాయి.

మే 30 నుంచి పెట్రోలు ధరలు ఢిల్లీలో లీటరుకు రూ.2.5 రూపాయలు తగ్గించాయి.

మరోవైపు డీజిల్ ధర మే 30 నుండి లీటర్ కు రూ. 1.69 తగ్గింది.గత వారంలో డీజిల్ ధరలు 24 పైసలు పడిపోయాయి అలాగే రెండు వారాలలో దరల పై 67 పైసలు తగ్గాయి.

జూన్ 16, 2017 వరకు పెట్రోలు, డీజిల్ ధరలు రెండుసార్లు నెలవారీగా సవరించబడ్డాయి. ధరల సమీక్షల యొక్క రోజువారీ వ్యవస్థకు మారడం అనేది దేశీయ వినియోగదారునికి ప్రపంచ చమురు ధరల మార్పులు మరింత వేగంగా ప్రసారం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

Read more about: petrol diesel
English summary

వరుసగా మూడవ రోజు తగ్గిన పెట్రోల్ ధరలు ఎంతో చూడండి. | Petrol Prices Cut For Third Straight Day, Diesel Falls By 7 paise. Check Fuel Prices In Your City

After two days of price cut, petrol prices on Saturday were slashed for the third straight day. Petrol prices in metro cities came down between 9 to 13 paise a litre.
Story first published: Saturday, June 23, 2018, 11:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X