For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేవలం రెండు రోజుల్లో ముకేశ్ అంబానీ సంపాదన ఎంతో తెలుస్తే షాక్ అవుతారు.

By Sabari
|

భారత శ్రీమంతుడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ సంపద కేవలం రెండు రోజుల వ్యవధిలో ఏకంగా 9,300 కోట్ల రూపాయలు పెరిగిందని పేర్కొంది బ్లూమ్‌బర్గ్.

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్

ప్రపంచవ్యాప్తంగా అత్యంత శ్రీమంతుల ఆస్తుల విలువను ఎప్పటికప్పుడు లెక్కిస్తూ, అత్యంత ధనికుల ర్యాంకింగ్స్‌ను ఇచ్చే ఈ సంస్థ ఈ విషయాన్ని పేర్కొంది. రోజువారీ అప్‌డేట్స్‌లో భాగంగా రెండు రోజుల వ్యవధిలో ముకేష్ అంబానీ ఆస్తుల విలువ ఈ స్థాయిలో పెరిగినట్లుగా బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ పేర్కొంది.

ముకేష్ అంబానీ

ముకేష్ అంబానీ

ఈ పెరుగుదలతో ముకేష్ అంబానీ భూ ప్రపంచంపై ఉన్న అత్యంత ధనికుల జాబితాలో 15వ స్థానానికి చేరుకున్నారు.

మొత్తం ఆస్తుల విలువ

మొత్తం ఆస్తుల విలువ

ముకేష్ అంబానీ మొత్తం ఆస్తుల విలువ 2.75 లక్షల కోట్ల రూపాయలు అని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఈ ఆస్తులతో ముకేష్ అంబానీ అత్యంత శ్రీమంతుల జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో 14వ స్థానంలో ఉన్నాడు జాక్ మా. ఆయన ఆస్తుల విలువ 3.11 లక్షల కోట్లు అని తెలుస్తోంది.

అమెజాన్ ఫౌండర్

అమెజాన్ ఫౌండర్

ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్. ఆయన ఆస్తి విలువ 144.8 బిలియన్ డాలర్లు. రెండో స్థానంలో ఉన్న బిల్ గేట్స్ ఆస్తుల విలువ 93.2 బిలియన్ డాలర్లుగా బ్లూమ్ బర్గ్ పేర్కొంది. వారన్ బఫెట్ మూడో స్థానంలో ఉన్నాడు ఆయన ఆస్తుల విలువ 80 బిలియన్ డాలర్లు.

శ్రీమంతుల జాబితాలోకి

శ్రీమంతుల జాబితాలోకి

500 మంది శ్రీమంతుల జాబితాలోకి తొలిసారి ఎంటరైంది అమెరికన్ టీవీ క్వీన్ ఓప్రా విన్ ఫ్రే. 273 కోట్ల రూపాయల ఆస్తులతో ఆమె ఈ జాబితాలో 483వ స్థానంలో నిలిచింది.

Read more about: mukesh ambani
English summary

కేవలం రెండు రోజుల్లో ముకేశ్ అంబానీ సంపాదన ఎంతో తెలుస్తే షాక్ అవుతారు. | Mukesh Ambani Earns 9300 Crores in Two Days

Mukesh ambani is the richest man in india who earns 9300 crores in two days.
Story first published: Saturday, June 23, 2018, 12:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X