For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు తరచూ కాష్ డిపాజిట్ చేయడానికి డిపాజిట్ మెషిన్ వాడుతున్నారా ఐతే ఇది మీకోసమే?

ఇంతకు ముందు డబ్బు డిపాజిట్ చేయాలంటే బ్యాంకుకి వెళ్లి ఫారం నింపి వరుస లైన్ లో నిబడి మరి డబ్బు డిపాజిట్ చేసేవాళ్ళం కానీ కొంతకాలంగా ప్రముఖ బ్యాంకులు కొన్ని నగదు డిపాజిట్ యంత్రాలను అందుబాటులో ఉంచింది

|

ఇంతకు ముందు డబ్బు డిపాజిట్ చేయాలంటే బ్యాంకుకి వెళ్లి ఫారం నింపి వరుస లైన్ లో నిబడి మరి డబ్బు డిపాజిట్ చేసేవాళ్ళం కానీ కొంతకాలంగా ప్రముఖ బ్యాంకులు కొన్ని నగదు డిపాజిట్ యంత్రాలను అందుబాటులో ఉంచింది ఇందులో సులభంగా నగదు డిపాజిట్ చేయవచ్చు బ్యాంక్ తో పని లేకుండా.ఇదంతా మంచిగానే ఉంది కానీ ఇటీవల ఒక వ్యక్తి కి నగదు డిపాజిట్ మెషిన్ పెద్ద షాక్ ఇచ్చింది అదేంటో చూడండి..

మీరు తరచూ కాష్ డిపాజిట్ చేయడానికి డిపాజిట్ మెషిన్ వాడుతున్నారా ఐతే ఇది మీకోసమే?

నగదు డిపాజిట్ మెషిన్ (సిడిఎం) లో తన కథ నంబర్ లో ఉన్న 8 నొక్కడానికి బదులు 0 అంకెను నొక్కాడు కేవలం ఒక్క అంకె పొరపాటుగా నొక్కినందుకు అతడికి అక్షరాలా 49 ,500 రూపాయలు స్వాహా ఐపోయాయి ఐతే ఆ వ్యక్తి తనకు న్యాయం చేయాలనీ కన్స్యూమర్ కోర్ట్ ను ఆశ్రయిన్చాగ విచారణ ఏడాది పాటు కొనసాగింది.

ఇదిలా ఉండగా బ్యాంకు సిబ్బంది నగదు వాపసు కు మాకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది, కోర్టు ఆ కేసును 'మానవ తప్పిదం'అని పేర్కొంటూ కొట్టివేసింది.

మహింద్ర కుమార్ యమమప్ప తన మొత్తం పొదుపు ఖాతాలో డిపాజిట్ చేశాడు. జూలై 18, 2017 న కర్నాటకలోని కలాబరగిలో డిపాజిట్ మెషిన్ ద్వారా తన పొదుపు ఖాతాలోకి డిపాజిట్ చేశాడు. మధ్యాహ్నం డిపాజిట్ చేసిన తరువాత, తన ఖాతాలో జమ ఐనట్టు చూపించే మెసేజ్ కోసం వేచి చూసాడు.కానీ రెండు రోజులు గడిచినప్పటికీ తన ఖాతాలో కి సొమ్ము జామకాలేదనే విషయాన్నీ గమనించి,అతడు తన కాలబరగిగి శాఖకు జులై 20 న ఫిర్యాదు చేశాడు.

యమనప్ప డిపాజిట్‌ చేసిన 14 రోజుల తర్వాత, అంటే ఆగస్ట్‌ 3న షబాబ్‌ ఏటీఎంలో తన కార్డును స్వైప్‌ చేయగా, రూ.49,500 బ్యాలన్స్‌ చూపించింది. దీంతో అతడు ఆ మొత్తాన్ని డ్రా చేసేసుకున్నాడు. దీంతో షబాబ్‌నుంచి రికవరీ చేయాలని కోరుతూ ఆదిలాబాద్‌ బ్రాంచ్‌కు కలబురిగి ఎస్‌బీఐ మేనేజర్‌ లేఖ రాశారు.

యమనాప్ప తన ఖాతా సంఖ్యలో 0 కి బదులుగా 8 అంకెను తప్పుగా నొక్కినందుకు డబ్బు వేరే ఖాతా లోకి వెళ్లిందని ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ పేర్కొన్నారు. ఆగస్టు 16 నుంచి 27 రోజుల తర్వాత ఆదిలాబాద్ శాఖకు డబ్బు రికవరీ కోసం బ్యాంకు లేఖ రాసినట్లు ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ పేర్కొన్నారు.

నాలుగు నెలల తరువాత, యమనాప్ప నవంబర్ 28 న జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార ఫోరం లో ఎస్బిఐపై ఫిర్యాదు చేసింది.

కస్టమర్ ఖాతాలో తప్పు నంబర్ నమోదుచేసాడని ఇది బ్యాంక్ తప్పు కాదని ఎస్బిఐ సలహాదారు వాదించారు. యమనప్ప తన ఫిర్యాదులో పొరపాటుగా నమోదు చేసిన నంబర్‌ను తెలియజేయలేదని పేర్కొన్నారు. దీంతో రిఫండ్‌కు అర్హత లేదని బ్యాంకు తేల్చి చెప్పడంతో, మానవ తప్పిదంగా పేర్కొంటూ యమనప్ప ఫిర్యాదును ఫోరం కొట్టేసింది.

Read more about: atm sbi
English summary

మీరు తరచూ కాష్ డిపాజిట్ చేయడానికి డిపాజిట్ మెషిన్ వాడుతున్నారా ఐతే ఇది మీకోసమే? | A Wrong Number At Cash Machine Costs Man Rs 49,000

Keying in 8 instead of 0 on the cash deposit machine (CDM) left a SBI customer poorer by Rs 49,500 and brought a year of his efforts to nought at the consumer court. While the bank said he was not eligible for a refund, the court dismissed the case as one of ‘human error’.
Story first published: Saturday, June 23, 2018, 12:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X