For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎయిర్టెల్ 15 వేల టవర్లు

By Sabari
|

ప్ర‌ముఖ టెలికాం సేవల సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తోంది.ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో కొత్త‌గా 15,000 ట‌వ‌ర్ల‌ను రెండు రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. దేశంలోనే అగ్ర‌శ్రేణి టెల్కో అయిన ఎయిర్‌టెల్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ స‌ర్కిల్‌లో మిమో టెక్నాల‌జీ సాయంతో ప్రీ-5జీ సేవ‌ల‌ను విస్త‌రించేందుకు సైతం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇటీవ‌లే ఐపీఎల్ 2018 స‌మ‌యంలో హైద‌రాబాద్ అంత‌ర్జాతీయ విమాన‌శ్ర‌యంలో ఈ టెక్నాల‌జీతో సేవ‌ల‌ను అందించింది. ముఖ్య‌మైన బిజినెస్, రెసిడెన్షియ‌ల్ హ‌బ్స్‌లో ప్రీ-5జీ ప‌రీక్ష‌ల‌ను చేయ‌నున్నారు. దీని ద్వారా వినియోగ‌దారులు అత్య‌ధిక డేటా వేగం పొందుతారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎయిర్టెల్ 15 వేల టవర్లు

తన నెట్‌వర్క్‌కు 3,000 కిలోమీటర్ల మేర అదనపు ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ను జోడించనుంది ఈ టెలికాం సంస్థ‌. విస్తరణ ద్వారా హై స్పీడ్‌ మొబైల్‌ డేటాను మరిన్ని ప్రాంతాలకు అందిస్తామని భారతీ ఎయిర్‌టెల్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఈవో అవనీత్‌ సింగ్‌ పురి బుధవారం మీడియాకు తెలిపారు.
'ఔటర్‌ రింగ్‌ రోడ్డులో 60 రోజుల్లో 100 శాతం నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తుంది. 2017-18లో 10,000 టవర్లు, 500 కిలోమీటర్ల ఆప్టిక్‌ ఫైబర్‌ అనుసంధానించాం. 3 కోట్ల మంది కస్టమర్లున్న తెలంగాణ‌,ఏపీ సర్కిల్‌లో 85 శాతం మేర 4జీ కవరేజీ ఉంది' అని చెప్పారు.

Read more about: airtel
English summary

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎయిర్టెల్ 15 వేల టవర్లు | Airtel Towers in Two Telugu States

Bharti Airtel, the leading telecom services company, has expanded its network in two Telugu states
Story first published: Friday, June 22, 2018, 9:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X