'అర్జున్ రెడ్డి' మూవీ టైటిల్ రోల్ పోషించిన విజయ్ దేవరకొండ మెడికోగా అద్భుత నటనతో అదరగొట్టాడు. ఈ సినిమా తెలుగునాట సంచలనం సృష్టించింది.

అర్జున్ రెడ్డి పాత్రలో
తమిళంలోనూ ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు. ఒక్క సినిమాతోనే విజయ్ స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి పాత్రలో అతడు ఒదిగిన తీరుకు మూవీ ఫ్యాన్స్ ఫిదా కాగా. ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

తొలి ఫిల్మ్‌ఫేర్
ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి, బాలయ్య లాంటి హీరోలను పక్కకు నెట్టి మరీ విజయ్ దేవరకొండ ఫిల్మ్‌ఫేర్‌ను దక్కించుకున్నాడు. అతడికి ఇదే తొలి ఫిల్మ్‌ఫేర్ కావడం విశేషం.
సీఎం రిలీఫ్ ఫండ్
తొలి ఫిల్మ్‌ఫేర్‌ను ఎవరైనా ఎంతో అపురూపంగా చూసుకుంటారు. కానీ ‘అర్జున్ రెడ్డి' మాత్రం ఓ మంచి పని కోసం దాన్ని వేలం వేసేందుకు సిద్ధపడుతున్నాడు. ‘‘రోజూ ట్విట్టర్లో చూస్తా, ఎంతో మంది సాయం కోరితే కేటీఆర్ అన్న సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేస్తారు. నా తొలి అవార్డు వేలంలో అమ్ముడుపోతే ఆ డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేస్తాను. ప్రజల్లోనూ అవగాహన వస్తుంది కదా'' అని విజయ్ ట్వీట్ చేశాడు. ‘ఈ అవార్డ్ ఒక బోనస్. దీన్ని ఇంట్లో షెల్ఫ్ మీద ఉంచడం కంటే నేను పుట్టిన ఈ సిటీకి ఇది మరింత ఉపయోగకరం' అని విజయ్ తెలిపాడు.
కేటీఆర్ స్పందించారు
విజయ్ దేవరకొండ ట్వీట్‌కు కేటీఆర్ స్పందించారు. తొలి ఫిల్మ్‌ఫేర్ సాధించినందుకు అభినందనలు తెలిపారు. ‘‘సీఎం రిలీఫ్ ఫండ్‌కి నువ్వు సాయం చేయాలని అనుకోవడం ఆనందంగా ఉంది. నీ చొరవను అభినందిస్తున్నా. ఈ విషయంలో ఏం చేయాలో మాట్లాడదాం'' అని కేటీఆర్ బదులిచ్చారు.

విజయ్ దేవరకొండ స్పందిస్తూ
కేటీఆర్ ట్వీట్‌కి విజయ్ దేవరకొండ స్పందిస్తూ. అలాగే అన్నా, ఫిల్మ్‌ఫేర్‌తో అనుబంధం ఏర్పడక ముందే దాన్ని ఇంట్లోనో లేదంటే ఆఫీసులోనో ఉంచేస్తానంటూ ట్వీట్ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తొలి ఫిల్మ్‌ఫేర్‌ను వేలం వేయాలని విజయ్ నిర్ణయించడం పట్ల ఫ్యాన్స్, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అమ్మానాన్నకు
అమ్మానాన్నకు ఇల్లు కట్టించి ఇచ్చినప్పుడు గెలిచినట్టు అనిపించింది. మళ్లీ అంతా అభినందిస్తుంటే గెలిచినట్టు అనిపిస్తోంది. వాళ్లు ఒప్పుకొంటే సోమవారమే వెళ్లి ఈ అవార్డ్ ఇచ్చేస్తానని అర్జున్ రెడ్డి హీరో తెలిపాడు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications