For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నష్టాలతో ముగిసిన ఈరోజు స్టాక్ మార్కెట్

|

రోజంతా కన్సాలిడేషన్‌ బాటలో నడిచిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు, చివరికి నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్‌ 74 పాయింట్ల నష్టంలో 35,548 వద్ద.. నిఫ్టీ 18 పాయింట్లు క్షీణించి 10,800 వద్ద స్థిరపడింది. మెటల్స్‌ షేర్లు, గ్లోబల్‌గా వస్తున్న ప్రతికూల సంకేతాలు నేటి ట్రేడింగ్‌లో మార్కెట్లను బొక్కబోర్లా పడగొట్టాయి. అమెరికా-చైనాల మధ్య ట్రేడ్‌వార్‌ వాణిజ్య వివాదాలు ముదురుతుండటంతో, స్టాక్‌ మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడి పెరిగింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లు అత్యధికంగా 2 శాతం వరకు పతనమయ్యాయి.

నష్టాలతో ముగిసిన ఈరోజు స్టాక్ మార్కెట్

వేదంత, కొటక్‌ మహింద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, కోల్‌ ఇండియా, హెచ్‌యూఎల్‌లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అయితే డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఐషర్‌ మోటార్స్‌, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓఎసీ నేటి ట్రేడింగ్‌లో లాభాలు పండించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా 80 పాయింట్లకు పైగా కిందకి పడిపోయింది. అమెరికా-చైనాల మధ్య ట్రేడ్‌ వార్‌ తీవ్రతరమవుతుండటంతో, యూరోపియన్‌ స్టాక్స్‌ కూడా నష్టాల్లోనే నడుస్తున్నాయి. చైనా దిగుమతులపై డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌లు విధించగా.. వెంటనే దానికి కౌంటర్‌గా చైనా కూడా స్పందించింది.

Read more about: stock market
English summary

నష్టాలతో ముగిసిన ఈరోజు స్టాక్ మార్కెట్ | Stock Market Down to 50 Points Today

The domestic stock markets, which went on a daily basis, ended with losses. The Sensex was down 74 points at 35,548,
Story first published: Monday, June 18, 2018, 16:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X