రిలయన్స్ జియో రాకతో టెలికం సంస్థల మధ్య టారిఫ్‌ల యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. ఒక టెలికం సంస్థ ఏదైనా రీఛార్జి ఆఫర్ తీసుకొస్తే.. దానికి పోటీగా మరో సంస్థ సరికొత్త ఆఫర్‌ను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా జియో, బీఎస్ఎన్ఎల్కు పోటీగా ఎయిర్టెల్ తన కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ఎక్కువగా వాయిస్‌కాల్స్ మాట్లాడుకునే వారికి ఉపయోగపడుతుంది.

ఎయిర్టెల్ తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు రూ.597 రీఛార్జిను ప్రవేశపెట్టింది. దీని కింద యూజర్లు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోమింగ్ అవుట్గోయింగ్ కాల్స్‌ను పొందవచ్చు. దీంతో పాటు రోజుకు వంద ఎస్ఎంఎస్లు ఉచితంగా లభిస్తాయి. అంతేకాదు.. 10జీబీ డేటాను ఇచ్చింది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 168రోజులు. కాల్స్, డేటా వినియోగంపై ఎటువంటి పరిమితులు లేవు. ఎక్కువ సమయం కాల్స్ మాట్లాడుకునే వారిని దృష్టిలో ఉంచుకొని ఎయిర్టెల్ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది.
రంజాన్ పండుగ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఎస్టీవీ 786 రీఛార్జికు పోటీగా ఎయిర్టెల్ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. 150 రోజుల వ్యాలిడిటీతో ఎస్టీవీ 786 ఆఫర్ కింద బీఎస్ఎన్ఎల్ రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్లు ఇస్తోంది. లాంగ్‌టర్మ్ ప్లాన్ కింద జియో కూడా రూ.999 రీఛార్జిని తీసుకొచ్చింది. 90 రోజుల కాల పరిమితితో, 60జీబీ డేటా, అపరిమిత లోకల్ కాల్స్, ఉచిత ఎస్ఎంఎస్లను జియో అందిస్తోంది.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications