For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాట్సాప్ పేమెంట్ ఫీచర్ వచ్చేసింది ఇక మొబైల్ లో చెక్ చేసుకోండి.

By Sabari
|

వాట్స‌ప్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌ను అందించింది. గ‌తేడాది కేవ‌లం బీటా స్టేజ్ ద‌శ‌లో కొంత‌మందికి మాత్ర‌మే అందుబాటులో ఉంచిన పేమెంట్ ఆప్ష‌న్ ఇప్పుడు అంద‌రికీ అందుబాటులో ఉండేలా చేసింది.

 యూజ‌ర్లు సెట్టింగ్స్‌లోకి

యూజ‌ర్లు సెట్టింగ్స్‌లోకి

దీని కోసం యూజ‌ర్లు సెట్టింగ్స్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్క‌డ మ‌ధ్య‌లో నోటిఫికేష‌న్స్ కింద పేమెంట్స్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. అయితే ఈ ఫీచ‌ర్ వాడుకోవ‌డానికి బ్యాంకు ఖాతాకు మొబైల్ నంబ‌రు లింక‌యి, ఆ మొబైల్ నంబ‌రు ప‌నిచేస్తూ ఉండాలి. వాట్స‌ప్ మీ మొబైల్ నంబ‌ర్ వెరిఫికేన్ కోసం అడుగుతుంది.

బ్యాంకు ఖాతాల

బ్యాంకు ఖాతాల

ఒక‌సారి వెరిఫికేష‌న్ పూర్త‌యితే బ్యాంకు ఖాతాల వివ‌రాలు వాట్స‌ప్‌లో యాడ్ అవుతాయి. గూగుల్ తేజ్ ఖాతాలో ఉన్న‌ట్లే ఒక‌టి కంటే ఎక్కువ ఖాతా వివ‌రాల‌ను వాట్స‌ప్ యాప్‌లో జ‌మ చేసుకోవ‌చ్చు.

ఎస్‌బీఐ

ఎస్‌బీఐ

వాట్స‌ప్ యాప్ ద్వారా యూజ‌ర్లు ఫండ్ ట్రాన్స్ ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. ఈ లావాదేవీలు యూపీఐ విధానం ద్వారా జ‌రుగుతాయి కాబ‌ట్ట ఎటువంటి ఛార్జీలు ఉండ‌వు. ఈ ఫీచ‌ర్ ప్ర‌వేశ‌పెట్ట‌డం కోసం వాట్స‌ప్ మొద‌ట ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల‌తో చేతులు క‌లిపింది.

వెరిఫికేష‌న్

వెరిఫికేష‌న్

ఒక‌సారి బ్యాంకు ఖాతాతో అనుసంధాన‌మైన మొబైల్ సంఖ్య వెరిఫికేష‌న్ పూర్త‌యి ఉంటే యూజ‌ర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయ‌డం ద్వారా కూడా డ‌బ్బు పంపించుకోవ‌చ్చు.

ఇవీ ముఖ్యాంశాలు

ఇవీ ముఖ్యాంశాలు

  • ఒక్కో లావాదేవీలో గ‌రిష్టంగా రూ.5000 వ‌ర‌కూ మాత్ర‌మే పంపుకోవ‌చ్చు.
  • ఈ యాప్ పేమెంట్ ఆప్ష‌న్లో రిక్వెస్ట్ మ‌నీ ఫీచ‌ర్ కూడా ఉంటుంది.
  • స్మార్ట్ ఫోన్ యూజ‌ర్లు స‌గ‌టున రోజుకు 3గంటల‌ సేపు వాట్స‌ప్ చూస్తున్న నేప‌థ్యంలో ఈ ఫీచ‌ర్ ఎంత‌మంది వాడ‌తారో చూడాల్సి ఉంది.

Read more about: whatsapp
English summary

వాట్సాప్ పేమెంట్ ఫీచర్ వచ్చేసింది ఇక మొబైల్ లో చెక్ చేసుకోండి. | Watsapp Payment Feature Came to Existence

Watsup gave good news to customers. Last year's payout option, which was only available to some of the beta stage, made it available for
Story first published: Saturday, June 16, 2018, 11:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X