దాదాపు 50 ఎలక్ట్రిక్ కార్లు తిరుమల తిరుపతి దేవస్థానం లో (టిటిడి) ఉపయోగించనున్నారు మరియు మొత్తం 350 వాహనాలను EESL ద్వారా ఆంధ్రప్రదేశ్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది.
దాదాపు 50 ఎలక్ట్రిక్ కార్లు తిరుమల తిరుపతి దేవస్థానం లో (టిటిడి) ఉపయోగించనున్నారు మరియు మొత్తం 350 వాహనాలను EESL ద్వారా ఆంధ్రప్రదేశ్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది విద్యుత్ కార్లలో ప్రయాణం చేయడానికి ఖరీదు కిలోమీటరుకు రూ.2 రూపాయలకన్నా తక్కువగా ఉంటుంది.

తిరుమల తిరుపతి:
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి), దాని అధికారుల రోజువారీ ప్రయాణానికి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించుకునే ప్రపంచంలోనే మొట్టమొదటి ఆలయం. రాష్ట్రంలోని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఎస్ఇఎల్) ఆంధ్ర ప్రభుత్వం కి 350 కార్లను అందజేసింది ప్రభుత్వం EV పాలసీ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేయనుంది.తిరుమల ఆలయంలో TTD అధికారులు ఉపయోగించేందుకు ఈ 50 ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉంటాయి.

ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL):
ఎం.ఎ. కమలాకర్ బాబు, ఎం.డి., న్యూ మరియు రినవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్.ఆర్.ఆర్.సి.ఎ.పి) లో మాట్లాడుతూ, "ఎలక్ట్రిక్ వాహనాలు ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) నుండి ఒక నెలవారీ చెల్లింపుగా నియమించేందుకు ఒప్పందం చేసుకున్నారు . ప్రారంభంలో, టిటిడితో సహా, ఎంచుకున్న ప్రాంతాల్లో 50 వాహనాలను నియమించబోతున్నాం అన్నారు. "ప్రతి నెలా కార్పొరేషన్ EESL కి రూ. 20,000 చెల్లించాలి మరియు డ్రైవ్ మరియు నిర్వహణ వ్యయాలను చూసుకునే విభాగానికి మరొక రూ .20,000 / ఇవ్వాలి.

ఎలక్ట్రిక్ వాహనాలను డ్రైవ్ చేయడానికి
ఈ ఎలక్ట్రిక్ వాహనాలను డ్రైవ్ చేయడానికి నియమించిన డ్రైవర్లకు కొత్త వాహనంలో బ్యాటరీలు మరియు గేర్లు ఎలా ఉపయోగించాలి అనే దానిపై ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రతి కారు ఖర్చు 11 లక్షలు మరియు ఆరు సంవత్సరాల తర్వాత ఈ వాహనాల యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబడుతుంది. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ (టిఎంసి), గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జివిఎంసి), అమరావతిలోని సెక్రటేరియట్లతో సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ విద్యుత్ వాహనాల అభివృద్ధిని చూడవచ్చు.

ఛార్జింగ్ పరికరాలు సరఫరా:
EESL నిబంధనల ప్రకారం, ఛార్జింగ్ పరికరాలు సరఫరా చేయడానికి AP ఈస్టర్న్ విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APEPDCL) ఇప్పటికే విక్రయదారులను ఖరారు చేసింది. తిరుపతి ఆలయంలో ఎలక్ట్రిక్ కార్లను నడపడానికి ఖర్చు కిలోమీటరుకు రెండు రూపాయలకన్నా తక్కువగా ఉంటుంది. పూర్తి ఛార్జ్ ఉన్న ఈ ఎలక్ట్రిక్ కార్లు (టాటా టిగోర్ ఎలక్ట్రిక్, మహీంద్రా ఇ-వెరిటో)దాదాపు 120 కిలోమీటర్ల ప్రయాణించగలవు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications