నేడు దేశీయ మార్కెట్ లో లాభాలతో మొదలైన రూపాయి?
నేడు ఉదయం మార్కెట్లో డాలర్ తో పోల్చుకుంటే రూపాయి 10 పైసలు పెరిగింది. సోమవారం లాభాలతో మొదలైన రూపాయి 67.40 వద్ద ముగిసింది.
నేడు ఉదయం మార్కెట్లో డాలర్ తో పోల్చుకుంటే రూపాయి 10 పైసలు పెరిగింది. సోమవారం లాభాలతో మొదలైన రూపాయి 67.40 వద్ద ముగిసింది. కీలకమైన సెంట్రల్ బ్యాంక్ విధాన సదస్సులు,అమెరికా మరియు ఉత్తర కొరియా సమావేశాలు ఈ వారంలో జరగనున్నాయి.

ఎగుమతిదారులు, బ్యాంకుల ద్వారా అమెరికన్ కరెన్సీని విక్రయించడంతో పాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లో అధిక ఓపెనింగ్ రూపాయి మారకం విలువను ప్రభావితం చేసింది.
శుక్రవారం నాటి ట్రేడింగ్ ముగింపు సమయానికి 38 పైసలు (0.57 శాతం) నష్టపోయి 67.50 వద్ద ముగిసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూపాయి మారకం విలువ ఏకంగా 5.30 శాతం పతనమయ్యింది.
మంగళవారం విడుదలకానున్న సీపీఐ, పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) గణాంకాల నేపథ్యంలో ట్రేడర్లు డాలర్ల అమ్మకాలకు మొగ్గుచూపారని తెలియజేశారు. ఏప్రిల్ ఐఐపీ 6 శాతం (అంతకుముందు నెలలో 4.4 శాతం), మే సీపీఐ 4.8 శాతం (అంతకుముందు నెలలో 4.58 శాతం) ఉండవచ్చన్న అంచనాలు రూపాయి విలువకు బలాన్ని ఇచ్చాయని వివరించారు.
బిఎస్ఇ సెనె్సక్స్ శుక్రవారం 148.70 పాయింట్లు పెరిగి 0.41 శాతం పెరిగి 35,592.37 వద్ద ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications