మీరు మీ ATM పిన్ భాగస్వామికి కానీ స్నేహితులకు గాని ఇస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు?
మీ జీవిత భాగస్వామి ,సన్నిహితులు లేక బంధువులు మీ డెబిట్ కార్డును ఉపయోగించి ATM నుండి డబ్బును డ్రా చేయడానికి వెళితే భారీ మూల్యం చెల్లించక తప్పదంటున్నారు.
మీ జీవిత భాగస్వామి ,సన్నిహితులు లేక బంధువులు మీ డెబిట్ కార్డును ఉపయోగించి ATM నుండి డబ్బును డ్రా చేయడానికి వెళితే భారీ మూల్యం చెల్లించక తప్పదంటున్నారు. ఈ ఇటీవలనే ప్రసూతి సెలవులో ఉన్న ఒక మహిళకు ఇది ఎదురయినది.

బ్యాంకింగ్ నియమాలు ప్రకారం ఒక ATM కార్డు అనేది ఒక వ్యక్తి కి సంబంధించి డబ్బు సురక్షితంగా ఉండాలని మంజూరు చేసినది మరియు ఖాతా హోల్డర్ కాకుండా మరే ఇతర వ్యక్తి వుపయోగించరాదని షరతు.
నవంబర్ 14, 2013 న, మారుతహళ్లి లో నివాసం ఉంటున్న వందన తన పిటిషన్లో పేర్కొంటూ తన ATM కార్డు పిన్ తో సహా తన భర్త రాజేష్ కుమార్ కి ఇచ్చానన్నారు, స్థానిక ఎస్బిఐ ఎటిఎం నుండి 25,000 రూపాయలు ఉపసంహరించుకుని రావాలని పంపానన్నారు. రాజేష్ ఎటిఎంకు వెళ్లి కార్డును ఉపయోగించి ఉపసంహరణ కోరాడు కాని డబ్బు చెల్లిస్తున్నట్లు చూపించే ఒక స్లిప్ ను యంత్రం పంపిణీ చేసింది కాని డబ్బు మాత్రం విడుదల చేయలేదు. ఎస్బిఐ 'నాన్-ట్రాన్స్ఫారబుల్' నిబంధనను పేర్కొంది మరియు ఖాతాదారు ATM వినియోగదారు కాదని అందువల్ల డబ్బు వాదనలు తిరస్కరించారని చెప్పారు.
అక్టోబర్ 21, 2014 న బెంగుళూరు IV అడిషనల్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెస్సల్ ఫోరమ్ ను వందన ఆశ్రయించి, ఎటిఎమ్ లావాదేవీలో ఆమె కోల్పోయిన 25,000 రూపాయలను ఎస్బిఐ తిరిగి చెల్లించలేదని ఆరోపించారు. ఆమె అప్పుడప్పుడే ఒక బిడ్డకు జన్మనిచ్చానని, ఇంటి నుండి బయటికి వెళ్ళలేనని,తన భర్త తన తరపున డబ్బును డ్రా చేయమని చెప్పానని పేర్కొంది.
ఎస్బిఐ అధికారులతోకు ఫిర్యాదు చేయగా, ఆ కేసును ఎటిఎమ్ 'నాన్-ట్రాన్స్ఫారబుల్' అని మూసివేశారు. లావాదేవీ జరిగిన సమయంలో ఖాతాదారుడు ATM వద్ద లేనందున, కేసు తిరస్కరించబడింది.
కొన్ని రోజుల తరువాత CCTV దృశ్యాలను వారు పరిశీలించారు అందులో తన భర్త నగదు ఉపసంహరణ లేని స్లిప్ ను తీసుకుంటున్న దృశ్యాలను కోర్ట్ ముందు ప్రవేశపెట్టారు కానీ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఖాతాదారు కానీ వ్యక్తి కార్డు ఉపయోగించినందున డబ్బు తిరిగి చెల్లించడం కుదరదని కేసును కొట్టేసారు.
కోర్ట్ తన తుది తీర్పులో, ఆమెకు వెల్లడిస్తూ తన భర్తకు స్వీయ చెక్ కానీ లేదా నగదు ఉపసంహరణకు సంబంధించి ఒక లెటర్ ఇవ్వాలి కానీ ATM గోప్యత పిన్ ను ఇవ్వకూడదని హితవు పలికింది.


Click it and Unblock the Notifications