గతేడాది డిసెంబర్ 2017 చివరి నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబాకీలు రూ. 8.31 లక్షల కోట్ల పైచిలుకు చేరిన నేపథ్యంలో బ్యాంకర్లతో పార్లమెంటరీ కమిటీ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
గతేడాది డిసెంబర్ 2017 చివరి నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబాకీలు రూ. 8.31 లక్షల కోట్ల పైచిలుకు చేరిన నేపథ్యంలో బ్యాంకర్లతో పార్లమెంటరీ కమిటీ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.వ్యవస్థలో ఉన్న మొండిబాకీల ప్రక్షాళనకు ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలనీ పార్లమెంట్ కమిటీ బ్యాంకర్లను ఆదేశించింది.

లోక్సభ ఎంపి వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఫైనాన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బ్యాంకర్లు సమావేశం సందర్భంగా నొక్కిచెప్పారు. కొన్ని సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టినంత మాత్రాన కార్పొరేట్లందరినీ అదే గాటన కట్టరాదని అభిప్రాయపడింది
ఎస్బిఐ చైర్పర్సన్ రాజ్నీష్ కుమార్, పిఎన్బి ఎండి సునీల్ మెహతా ఈ ప్యానల్ లో ఎన్ఎపిలు, బ్యాంకింగ్ మోసాలపై వివిధ అంశాలను పరిశీలించారు.
త్వరలో పార్లమెంటరీ కమిటీతో భేటీ కానున్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కూడా.. మొండి బాకీల ప్రక్షాళనకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించనున్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్పిఎలు డిసెంబర్ 2017 నాటికి రూ .7.77 ట్రిలియన్ కోట్లు దాటిందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి.
కార్పొరేట్ల మోసాలు, ఎగవేతలతో పెరిగిపోతున్న మొండిబాకీలను భర్తీ చేయడానికి ప్రజాధనాన్ని ఎందుకు ఉపయోగించాల్సి వస్తోందన్నది అర్ధం కాకుండా ఉందంటూ కమిటీలో సభ్యుడైన టీఎంసీ ఎంపీ దినేష్ త్రివేది వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నాయి.
ఈ కమిటీ ముందు బ్యాంకింగ్ రంగాలకు సంబంధించిన అంశాల గురించి ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ ద్వారా వివరించారు.
సమావేశానికి కమిటీ లో సభ్యులుగా ఉన్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హాజరు కానున్నారు.


Click it and Unblock the Notifications