పేరు చేవెళ్ల రవి ఇతను కావలి నరసింహ మరియు యాదమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం 1989 ఏప్రిల్ 5 న జన్మించాడు. ఇతని విద్యాబ్యాసం చేవెళ్లలో జరిగింది. ఇతను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఇప్పటికే మీకు అర్థమైపోయింటుంది ఎవరో అతను అని. అదే నండి మన బిత్తిరి సత్తి.

రంగస్థల నటనలో
ప్రస్తుతం బిత్తిరి సత్తి వయస్సు 28 సంవత్సరాలు చిన్నప్పటినుండి సినిమాల పై ఇష్టం పెంచుకున్న రవి అలియాస్ మన బిత్తిరి సత్తి సినిమాలలో రాణించాలి అనుకున్నాడు. అందుకోసం తన ఊరి పక్కన ఉన్న నాటక కళాకారుల వద్ద రంగస్థల నటనలో శిక్షణ తీసుకోని కొన్ని నాటకాలలో నటించాడు.

zee తెలుగులో
2012 లో zee తెలుగులో ప్రసారమైన కామెడీ క్లబ్ రియాలిటీ షోలో పాల్గొన రవి అలియాస్ బిత్తిరి సత్తి జర్నలిజం చదివాడు.ఈ కోర్స్ పూర్తిఅయ్యాక వివిధ చానెల్స్ లో వ్యాఖ్యాతగా పని చేసాడు.

V6 ఛానెల్లో
2015 లో V6 ఛానెల్లో చేరడంతో అతని జీవితం మలుపు తిరిగింది. తీన్మార్ అనే కారిక్రమంలో బిత్తిరి సత్తి గా తీన్మార్ సావిత్రితో కలిసి అందించే కామెడీ వార్తలకు ప్రేక్షకులు నుంచి మంచి స్పందన రావడంతో బిత్తిరి సత్తిగా పాపులర్ అయ్యాడు రవి. బిత్తిరి సత్తి రాకతో ఆ కారిక్రమం విజయవంతం అయింది.

TRP రేటింగ్
తీన్మార్ కారిక్రమంతో V6 ఛానల్ కు TRP రేటింగ్ బాగా పెరిగింది, దింతో మిగతా టీవీ చానెల్స్ తో పోటీగా V6 ఛానల్ నిలిచింది.

ఇప్పుడు ఐతే
ఇప్పుడు ఐతే మన బిత్తిరి సత్తికి సినిమాలు క్యూ కడుతున్నాయి కానీ ముందు మాత్రం మన చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి సినిమాలోకి పోవడానికి చాల కష్టపడ్డాడు.

డబ్బింగ్ ఆర్టిస్ట్
2003 లో సినిమాలో అవకాశాల కోసం హైదరాబాద్ కి వచ్చి కృష్ణ నగర్ లో ఉండి సినిమా డైరెక్టర్లను కలిసేవాడు. తర్వాత తమ్మారెడ్డి గారి దగ్గర మేనేజర్ గా పని చేసాడు. కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి ఇచ్చిన సలహాతో 2005 లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా యూనియన్ మెంబెర్ షిప్ తీసుకున్నాడు.

150 సినిమాల వరకు
ఇతను 15 సంవత్సరాలు డబ్బింగ్ చెబుతూ 150 సినిమాల వరకు డబ్బింగ్ చెప్పాడు. ఆలా సీమ శాస్త్రి సినిమాతో సినిమాలోకి అడుగు పెట్టాడు ఆ తర్వాత గుణశేఖర్ తీసిన రుద్రమదేవిలో సామంత రాజుగా చేసాడు. ఇప్పుడు చాల సినిమాలలో నటిస్తూ చాల బిజీ ఐపోయాడు.

బిత్తిరి సత్తి ఇల్లు
బిత్తిరి సత్తి ఇల్లు చూస్తే ఆశ్చర్యపోతారు ఈయనకి హైదరాబాద్ ఫిలిం సిటీ లో ఒక కాస్టలీ ఇల్లు ఉంది.ఆ కాస్టలీ ఇల్లు చూడడానికి ఇంద్రభవనంలాగా ఉంటుంది.

నెలకి
బిత్తిరి సత్తికి నెలకి రూ.1 లక్ష రూపాయిలు సంపాదిస్తున్నాడు. ఇతనికి భార్య ఒక కుమారుడు ఉన్నారు. తీన్మార్ వార్తల ద్వారా పేరు తెచుకున్న బిత్తిరి సత్తి మరిన్ని సినిమాలో మంచి అవకాశాలు తెచుకోవాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications