బ్యాంకర్ల రెండు రోజుల బంద్‌తో ఏటీఎంల వద్ద నగదు కష్టాలు రెట్టింపు కానున్నాయి. ఇప్పటికే అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఏరియాస్‌లోని ఏటీఎంలలో సరైన స్థాయిలో నగదు లభ్యత లేదు.

నో క్యాష్
సగానికి సగం ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు శాశ్వాతం అన్నట్టుగా నిలిచిపోయాయి. ఇక మిగతావి కూడా అప్పుడప్పుడు మాత్రమే పని చేస్తూ ఉంటాయి. ఎప్పుడు క్యాష్ అందుబాటులో ఉంటుందో, ఎప్పుడు అందుబాటులో ఉండదో చెప్పలేని పరిస్థితి

మహానగరం
ఇలా దేశ వ్యాప్తంగా నగదు కష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. మే నెల ఆరంభంలో క్యాష్ కష్టాలు పతాక స్థాయికి చేరాయి. ఆఖరికి దేశ ఆర్థిక రాజధాని ముంబాయి మహానగరంలోని ఏటీఎంలలో కూడా నగదు లభ్యత లేని పరిస్థితి.

హైదరాబాద్
హైదరాబాద్ నగరం కూడా అప్పుడు క్యాష్ కష్టంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అదే సమయంలో జిల్లా కేంద్రాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లోని ఏటీఎంల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఖాతాల్లోని డబ్బు తీసుకోలేక ప్రజలంతా విసిగిపోయారు

మండల కేంద్రాల్లో
సిటీల్లో అయితే క్యాష్ లెస్ లావాదేవీలకు అవకాశం ఉంటుంది. జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో, మండల కేంద్రాల్లో ఇప్పటికీ దానికి ఉన్న అవకాశం అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో జనాలు విసిగి వేసారి పోయారు.

బ్యాంకులే బంద్
ఆ తర్వాత ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. అప్పుడప్పుడైనా నగదు అందుబాటులో ఉంటూ వస్తోంది. అయితే రేపు, ఎల్లుండి బ్యాంకర్ల బంద్‌తో పరిస్థితి మళ్లీ మొదటకు వచ్చేలా ఉంది. బ్యాంకులే బంద్ అయిపోతూ ఉండటంతో ఏటీఎంలలో నగదును పర్యవేక్షించే నాథుడు ఉండడు. దీంతో జనాలకు మళ్లీ క్యాష్ కష్టాలు తప్పవు.

అంతో ఇంతో ఊరట
అయితే ఇప్పుడు బంద్‌కు వెళ్లింది కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే. ప్రేవేట్ బ్యాంకులు యథాతథంగా పని చేస్తున్నాయి. అంతో ఇంతో ఊరట ఇదే!
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications