యోగా గురు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ మరింతగా విస్తరిస్తోంది. స్వదేశీ ఉత్పత్తుల నినాదంతో కన్జ్యూమర్ గూడ్స్ విభాగంలో నమ్మకమైన బ్రాండ్‌గా నిలదొక్కుకున్న పతంజలి.

బీఎస్ఎన్ఎల్
ఇప్పుడు టెలీకాం రంగంలోకి అడుగుపెట్టింది. టెలీకాం రంగంలోనూ స్వదేశీయతను చాటేలా ప్రభుత్వ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)తో జతకట్టింది.

బాబా రాందేవ్
ఈ మేరకు ‘స్వదేశీ సమృద్ధి సిమ్' కార్డ్స్ పేరిట ఆదివారం పతంజలి సిమ్ కార్డులను విడుదల చేసింది. పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ స్వయంగా ఈ సిమ్ కార్డులను విడుదల చేశారు.

టెలీ సర్వీసులే కాకుండా
పతంజలి వెల్లడించిన వివరాల ప్రకారం .ఈ సిమ్ కార్డులతో 2జీబీ డాటా, అపరిమిత కాలింగ్ ప్లాన్లను అందజేస్తారు. కేవలం టెలీ సర్వీసులే కాకుండా అనేక ప్రయోజనాలను కూడా ఈ స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డుల ద్వారా అందించనున్నట్లు పతంజలి వెల్లడించింది.

పతంజలి ఉద్యోగులు మాత్రమే
అయితే ఈ సిమ్ కార్డులు, వాటి ద్వారా వచ్చే ప్రయోజనాలను ప్రస్తుతం కేవలం పతంజలి ఉద్యోగులు మాత్రమే పొందడానికి వీలుంది. సామాన్యులకు ఈ సిమ్ కార్డులు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో పతంజలి వెల్లడించలేదు

పతంజలి ఉత్పత్తులపై
అయితే రాబోయే కొద్ది నెలల్లో ఈ సిమ్ కార్డులు అందరికీ అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. సామాన్యులకు అందుబాటులోకి వచ్చాక, ఈ సిమ్ కార్డును కొనుగోలు చేసిన వినియోగదారులు పతంజలి ఉత్పత్తులపై కూడా 10 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. రూ.144 రీచార్జ్‌తో అపరిమిత సేవలుమీరు పొందచ్చు
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications