జర్మనీకి చెందిన ఈ లగ్జరీ కార్ల కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై 10 లక్షల రూపాయల వరకు డిస్కౌం ట్లు ఇస్తోంది. పరిమిత కాలమే ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు ఇస్తున్నట్టు కంపెనీ తెలిపింది.

ఆకర్షణీయమైన ఆఫర్‌ను
లగ్జరీ కార్లపై దిగుమతి సుంకం పెంచడం వల్ల ఆడి కార్ల అమ్మకాలపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో మార్కెట్లో నెలకొన్న సవాళ్లను అధిగమించేందుకు, కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.

ఎ3, ఎ4, ఎ6
ఎ3, ఎ4, ఎ6 సెడాన్లు, ఎస్‌యువి క్యు3 వంటి పాపులర్ మోడళ్లపై 2.7 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు డిస్కౌంట్లు ఇస్తున్నామని, జూన్ వరకు ఇవి అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ‘‘దిగుమతి సుంకాలు, పన్నుల కారణంగా కస్టమర్లు తమ కలల కారును కొనుగోలు చేయకుండా ఉండే పరిస్థితి ఉండకూడదని ఈ డిస్కౌంట్లు ఇస్తున్నాం''అని ఆడి ఇండియా హెడ్ రహిల్ అన్సారీ తెలిపారు

అమ్మకాల వృద్ధి
ఈ ఏడాదిలో కార్ల అమ్మకాల వృద్ధి రెండంకెల్లో ఉంటుందని అంచనా వేశామని, బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకం పెంచిన నేపథ్యంలో అమ్మకాలు గత ఏడాది స్థాయిలోనే ఉండే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చినట్టు ఆయన చెప్పారు.

జూన్ నెలల్లో
ఈ తరుణంలో మార్కెట్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే వ్యూహాలను అనుసరిస్తున్నామని అన్సారీ తెలిపారు. హాలీడేస్ ఉండటం వల్ల సాధారణంగానే మే, జూన్ నెలల్లో అమ్మకాలు తక్కువగా ఉంటాయని ఆయన చెప్పారు. గత ఏడాది ఇదే సీజన్‌లో జిఎ్‌సటి అమలుకు ముందు మంచి డిస్కౌంట్లను ఇవ్వడం వల్ల అమ్మకాలు పెరిగాయని ఆయన గుర్తు చేశారు.

ఆకర్షణీయమైన ఆఫర్
ఈసారి అమ్మకాలు పెంచుకునేందుకు ఇదే తరహా ఆఫర్లను తెస్తున్నామన్నారు. కొన్ని మోడళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్ కూడా ఉందన్నారు. ఈ ఏడాదిలో కార్లను కొనుగోలు చేసి వచ్చే ఏడాది నుంచి చెల్లింపులు ప్రారంభించే సదుపాయాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. 2017 సంవత్సరంలో ఆడి 7,876 కార్లను విక్రయించింది. అంతకు ముందు ఏడాది (7,720)తో పోల్చితే అమ్మకాల్లో 2 శాతం వృద్ధి నమోదైంది రెఫెరెన్స్ ఫ్రొమ్ ఏబిన్.


Click it and Unblock the Notifications