నిండా 6 ఏళ్ళు కూడా లేవు కానీ ఈ పిల్లాడు రోజుకి రూ .లక్ష రూపాయిలు సంపాదిస్తున్నాడు అంటే మీరు నమ్ముతార? నిజంగా ఇది ఆశ్చర్యానికి గురి చేసే విషయం.

సాఫ్ట్ వేర్ ఉద్యోగులు
సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సైతం ఈ పిల్లవాడి సంపాదనకి సరి తూగరు. డిగ్రీలు, పి.జి లు , ఇంజనీరింగ్ చేసిన మహామహులకి కానిది ఈ పిల్లవాడు చేసి చూపిస్తున్నాడు.

ఈ పిల్లవాడు
ఈ పిల్లవాడు నెలకి రూ.1 లక్ష రూపాయిలు సంపాదిస్తున్నాడు అది ఎలాగో తెలుసా వంటలు చేసి, తన వంటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడు. అసలు ఇంతకీ ఈ పిల్లవాడు ఎవరు? వంటలు చేసి డబ్బులు ఎలా సంపాదిస్తున్నాడు అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవలసిన విషయం.

నిహాల్ రాజ్
నిహాల్ రాజ్ ఇతనికి ఇప్పుడు ప్రపంచం అంత ఫాన్స్ ఉన్నారు. ఇంటర్నెట్ లో ఈ పిల్లవాడు గురించి సర్చ్ చేస్తే చాలు ఈ పిల్లవాడి వివరాలు వస్తాయి.

కేరళ రాష్ట్రానికి
నిహాల్ కి 6 ఏళ్ళు కూడా నిండలేదు సాధారణంగా ఈ వయస్సులో అందరు స్కూల్ కి వెళ్లి చదువుకుంటూ, ఆటపాటలతో సరదాగా గడుపుతుంటారు. కేరళ రాష్ట్రానికి చెందిన నిహాల్ మాత్రం లక్షలు సంపాదిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

చిన్నగాఉన్నప్పుడే
నిహాల్ కి వంటలు చేయడం అంటే ఇష్టం నిహాల్ చిన్నగాఉన్నప్పుడే తన తల్లి వంటలు వండుతున్నపుడే వెళ్లి నిహాల్ శ్రద్ధగా గమనించేవాడు.వంట గదిలో తల్లికి సహాయం చేస్తూ ఏ వంటని ఎంత రుచిగా చేయాలో తెలుసుకుంటూ ఉండేవాడు.

వీడియో తీసి
ఇతను వండే వంటలు రుచి చూసి కాకలు తీరిన వంటగాలు అవి తిని షాక్ ఐపోయేవారు. అంత రుచిగా నిహాల్ వంట చేస్తాడు. నిహాల్ 4 ఏళ్ళ వయస్సులో వంట గదిలో వండుతూండగా నిహాల్ తండ్రి వీడియో తీసి ఆ వీడియోని ఫేస్ బుక్ లో పెట్టాడు. నెటిజెన్లకీ ఆ వీడియో నచ్చి అది కాస్త వైరల్ గా మారింది.

ఫేస్ బుక్ లో
ఆరోజు నుంచి తన తండ్రి నిహాల్ తో రుచికరమైన వంటకాలు చేయించి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసేవాడు. ఎలా నిహాల్ చేసిన వంట వీడియోలకి మంచి ఆదరణ రావడంతో ఫేస్ బుక్ వారు నిహాల్ వీడియోలకి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు.

మిక్కీ మౌస్ మ్యాంగో ఐస్ క్రీమ్
నిహాల్ చేసిన మిక్కీ మౌస్మ్యాంగో ఐస్ క్రీమ్ వీడియోకి ఫేస్ బుక్ $2000 డాలర్లను ఇచ్చింది. ఇక పోతే నిహాల్ రాజ్ కి కిచ్చా ట్యూబ్ అనే యు ట్యూబ్ ఛానల్ ఉంది దింట్లో కూడా ఈ పిల్లవాడికి డబ్బులు వస్తాయి.

ప్రముఖ ఛానల్ లో
అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ ఛానల్ లో నిహాల్ తో వంట ప్రోగ్రామ్లు నిర్వహిస్తున్నాయి. అమెరికా లోని LS అని ప్రముఖ టీ వీ షోలో కూడా నిహాల్ వండిన పుట్టు అనే కేరళ సాంప్రదాయ వంటకానికి అవార్డు వచ్చింది. UK లోని లిటిల్ బిగ్ షాట్స్ అనే ప్రోగ్రాంలో అవార్డు ఇవ్వడం జరిగింది.

రోజుకి రూ.1 లక్ష
ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన అనేక ఛానెళ్లు వంట ప్రోగ్రాంకి హోస్ట్ గా నిహాల్ ని తీసుకెళ్లి నిర్వహిస్తుంటాయి. ఇలా అనేక పద్థతులలో రోజుకి రూ.1 లక్షరూపాయిల పైనే సంపాదిస్తున్న నిహాల్ ఎంతో మందికి ఆదర్శనంగా నిలుస్తున్నాడు.

కొంత భాగం చారిటీలకు
నిహాల్ ఈ వయస్సులో సంపాధించడమే కాదు తన సంపాదనలో కొంత భాగం చారిటీలకు ఇస్తున్నాడు. మరి ఇదంతా చూస్తుంటే నిహాల్ కి ఖచ్చితంగా శెభాష్ అని అనలిపిస్తోంది కాదు. ఒక నిహాల్ అనే కాదు మన పిల్లలలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అది గుర్తించి ప్రోసహించాల్సింది మాత్రం తల్లితండ్రులు మాత్రమే.


Click it and Unblock the Notifications