For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూత్ ని ఆకట్టుకొనే అదిరిపోయే మరో కొత్త ఫీచర్ వదిలిన వాట్సాప్

By Sabari
|

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న యూజ‌ర్ల‌కు మ‌రో అద్భుత‌మైన ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

మీడియా విజిబిలిటీ

మీడియా విజిబిలిటీ

'మీడియా విజిబిలిటీ' పేరుతో ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచ‌ర్ ద్వారా యూజ‌ర్లు తాము వాట్సాప్‌లో ఓపెన్ చేసే ఫొటోలు, వీడియోల‌ను ఫోన్ గ్యాల‌రీలో క‌నిపించ‌కుండా చేయ‌వ‌చ్చు. అందుకు గాను యూజ‌ర్లు వాట్సాప్ లో సెట్టింగ్స్‌, డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ విభాగంలోకి వెళ్లి కింద ఉండే మీడియా విజిబిలిటీ అనే ఆప్ష‌న్‌కు ఉన్న టిక్ మార్క్ తీసేయాలి. దీంతో ఫోన్ గ్యాల‌రీలో వాట్సాప్ ఫొటోలు, వీడియోలు క‌నిపించ‌వు.

త్వ‌ర‌లోనే యూజ‌ర్లంద‌రికీ

త్వ‌ర‌లోనే యూజ‌ర్లంద‌రికీ

మళ్లీ అవి క‌నిపించాలంటే అదే ఆప్ష‌న్‌కు టిక్ మార్క్ పెట్టాలి. దీంతో ఎప్ప‌టిలాగే ఆ మీడియా అంతా ఫోన్ గ్యాల‌రీలో క‌నిపిస్తుంది. అయితే ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్ కేవ‌లం ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ బీటా వెర్ష‌న్ ను వాడుతున్న యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ల‌భిస్తున్న‌ది. త్వ‌ర‌లోనే యూజ‌ర్లంద‌రికీ పూర్తిస్థాయిలో ఈ ఫీచ‌ర్ ల‌భిస్తుంది.

ఐఓఎస్‌లో

ఐఓఎస్‌లో

ఐఓఎస్‌లో వాట్సాప్‌ను వాడే వారి కోసం మరో కొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చారు. 'న్యూ కాంటాక్ట్ షార్ట్‌క‌ట్' పేరిట ఈ ఫీచ‌ర్‌ను యాపిల్ ఫోన్ వినియోగదారుల కోసం తీసుకొచ్చారు.

సులభంగా క్రియేట్

సులభంగా క్రియేట్

ఈ ఫీచర్ ద్వారా కొత్త కాంటాక్ట్‌ నెంబర్లను సులభంగా క్రియేట్ చేసుకోవ‌చ్చు. ఈ ఫీచ‌ర్ పొందాలంటే ఐఓఎస్‌లో.. వాట్సాప్‌ను కొత్త వెర్ష‌న్‌కు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

Read more about: whatsapp
English summary

యూత్ ని ఆకట్టుకొనే అదిరిపోయే మరో కొత్త ఫీచర్ వదిలిన వాట్సాప్ | New Whatsapp Feature visibility Introduced to Attract Youth

The popular Instant Messaging App Watsap has brought to its users another amazing feature.
Story first published: Saturday, May 26, 2018, 12:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X