For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు రోజులు బ్యాంకులు సెలవు అంట ఎప్పుడో తెలుసా? చూడండి.

By Sabari
|

ఈ నెల 30, 31 తేదీల్లో సమ్మెకు దిగుతున్నట్టు బ్యాంకు ఉద్యోగు సంఘాల నేతలు(యూఎఫ్‌బీయూ) ప్రకటించారు. వేత‌న స‌వ‌ర‌ణ‌ను సమీక్షించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.

సమ్మెకు పిలుపునిచ్చాయి

సమ్మెకు పిలుపునిచ్చాయి

బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలతో బ్యాంక్ యాజమాన్యాలు చర్చించాయి. కానీ, ఈ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ విషయమై కేంద్రం జోక్యం చేసుకోవాలని కూడ బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్స్ నేతలు డిమాండ్ చేశారు.

 ప‌నిదినాలు

ప‌నిదినాలు

15 శాతం వేతన సవరణ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా వారానికి ఐదు రోజుల ప‌నిదినాలు, ఉద్యోగుల‌కు ప‌నిభారం త‌గ్గించ‌డం వంటివి డిమాండ్ల‌లో మ‌రికొన్ని.

 2 శాతం మాత్రమే

2 శాతం మాత్రమే

కానీ, కేవలం 2 శాతం మాత్రమే వేతనాలు పెంచేందుకు బ్యాంకు యాజమాన్యాలు ముందుకు వచ్చాయి. అయితే 30% వేత‌న పెంపున‌కు ఇంత‌కుముందే ఐబీఏ అంగీక‌రించి వెన‌క్కు త‌గ్గ‌డంపై బ్యాంకు ఉద్యోగులు ఆగ్ర‌హంతో ఉన్నారు.

పీఆర్సీ

పీఆర్సీ

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పీఆర్సీ ఉన్న‌ట్లే త‌మ‌కు కావాల‌ని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీంతో బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చింది. మరో వైపు పారిశ్రామిక వేత్తలు బ్యాంకులకు వేలాది కోట్లు రుణాలుగా తీసుకొని ఎగ్గొట్టడం వల్ల బ్యాంకులు నష్టాలబారినపడుతున్నాయి.

 మే 30, 31 తేదిల్లో

మే 30, 31 తేదిల్లో

ఉద్యోగులను విభజించి పబ్బం గడుపుకొనేందుకు పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారని బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ నేతలు ఆరోపిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా మే 30, 31 తేదిల్లో రెండు రోజుల పాటు బ్యాంకు సేవలకు అంతరాయమేర్పడనుంది. జూన్ 1వ తేదిన బ్యాంకులు తెరుచుకోనున్నాయి.

English summary

రెండు రోజులు బ్యాంకులు సెలవు అంట ఎప్పుడో తెలుసా? చూడండి. | Bank Employees Strike Two Days on May 30th and 31st.

Bank Employees Union (UFBU) has announced a strike on September 30 and 31 this year. The banking unions are demanding to review the wage revision. The banking unions have announced that their demands are addressed.
Story first published: Friday, May 25, 2018, 13:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X