అమెజాన్ డెలివరీ బాయ్ ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు. ఎవరు ఈ రఘువీర్ సింగ్ చౌదరి?
అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుందనేది జగమెరిగిన సత్యం. ఈ యువకుడి విషయంలో అది మరోసారి రుజువైంది.

రఘువీర్ సింగ్ చౌదరి
రాజస్థాన్‌లోని జైపూర్ పట్టణానికి చెందిన రఘువీర్ సింగ్ చౌదరి ఓ పేద కుటుంబంలో పుట్టాడు. దీంతో చిన్నప్పటి నుంచి అతనికి కష్టం అలవాటైంది.

డెలివరీ బాయ్‌గా
ఆర్థిక స్థోమత లేకపోవడంతో అరకొర చదువుతో సరిపెట్టాల్సి వచ్చింది. రఘువీర్ సింగ్ తెలిసిన వారి ద్వారా అమెజాన్ సంస్థలో డెలివరీ బాయ్‌గా చేరాడు. నెలకు 9వేల జీతం. బైక్ లేకపోవడంతో సైకిల్ పైనే కస్టమర్లకు ప్రొడక్ట్స్‌ను డెలివరీ చేసేవాడు

ఆగి టీ తాగేవాడు.
అయితే ఇలా డెలివరీ చేస్తున్న సమయంలో రఘువీర్ అక్కడక్కడా ఆగి టీ తాగేవాడు. అన్ని చోట్లా టీ రుచిగా ఉండేవి కావు. స్వతహాగా డెలివరీ బాయ్ కావడంతో ఆ సమయంలో అతనికో ఐడియా వచ్చింది.

అందరికీ నచ్చే విధంగా
అందరికీ నచ్చే విధంగా టీ తయారుచేసి.. హోం డెలివరీ చేయాలనుకున్నాడు. తన ఫోన్ నెంబర్‌ను, వాట్సాప్‌ను ఆర్డర్లకు సాధనాలుగా ఎంచుకున్నాడు.

ముగ్గురు స్నేహితులతో కలిసి
తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఐడియాను అమలు చేశాడు. ఊహించని రీతిలో తన ప్రయత్నం సక్సెస్ అయింది. రోజుకు 500 నుంచి 700వరకూ ఆర్డర్లు వస్తున్నాయి. కప్పు టీ ధర 5రూపాయలే కావడం.. అది కూడా హోం డెలివరీ చేస్తుండటంతో వినియోగదారులు ఆకర్షితులయ్యారు

నాలుగు బ్రాంచ్‌లు పెట్టే స్థాయికి
ఒకచోట ప్రారంభమైన ఈ మాజీ అమెజాన్ ఉద్యోగి ప్రయాణం ఇప్పుడు జైపూర్ పట్టణంలో నాలుగు బ్రాంచ్‌లు పెట్టే స్థాయికి వెళ్లింది. నెలకు 9వేలు జీతం తీసుకున్న రఘువీర్ ఇప్పుడు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు.

కష్టపడ్డ వారికి
కష్టపడ్డ వారికి ఎన్నటికైనా ఫలితం దక్కుతుందనడానికి రఘువీర్ సక్సెస్ స్టోరీ నిదర్శనంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు కంటెంట్ ఫ్రొమ్ ఏబిన్.


Click it and Unblock the Notifications