అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌తో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీకి బాగా కలిసొచ్చింది. అదెలాగంటారా..? అజీమ్ ప్రేమ్‌జీ వ్యక్తిగత సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ 2014 ఫిబ్రవరిలో ఆన్‌లైన్ ఫ్యాషన్ ప్లాట్‌ఫామ్ మింత్రా డాట్‌కామ్‌లో 2.5 కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. 2014 మే నెలలో ఫ్లిప్‌కార్ట్ మింత్రాను 30 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. తాజాగా వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను 1,600 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయబోతోంది. అందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన అన్ని విభాగాలు వాల్‌మార్ట్ పరంకానున్నాయి. ఈ నేపథ్యంలో మింత్రా నుంచి వైదొలుగుతున్న ప్రేమ్‌జీఇన్వె్‌స్టకు 13 కోట్ల డాలర్లు లభించనున్నాయి. అంటే, కేవలం నాలుగేళ్లలో ప్రేమ్‌జీ పెట్టిన పెట్టుబడిపై నాలుగు రెట్లకుపైగా రిటర్నులు లభించనున్నాయన్నమాట.

ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ స్నాప్‌డీల్, లెన్స్‌కార్ట్, పాలసీ బజార్, ఐడి ఫ్రెష్ ఫుడ్, అమాగీ మీడియా లాబ్స్‌తోపాటు పలు స్టార్ట్‌పలలో పెట్టుబడులు పెట్టింది. గత ఏడాది జూన్‌లో ఫైర్‌సైడ్ వెంచర్స్ అనే వెంచర్ క్యాపిటల్ ఫండ్‌లోనూ ఇన్వెస్ట్ చేసింది. వాల్‌మార్ట్‌తో డీల్‌లో భాగంగా భారీగా లాభపడనున్న ఇండియన్లలో ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ ఒకరు. బన్సల్ సంస్థలో తనకున్న 5.2 శాతం వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించనున్నారు. ఇందులో భాగంగా ఆయనకు 100 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత, మాజీ ఉద్యోగులు కూడా ఎంప్లాయి స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్‌లో భాగంగా కేటాయించిన షేర్లను తిరిగి కంపెనీకే విక్రయించనున్నారు. తద్వారా వీరికి 50 కోట్ల డాలర్ల మేర సమకూరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications