బీజేపీ పార్టీ ,JDS శాసనసభ్యులను ₹ 100 కోట్ల ఆఫర్ తో పాటు కేబినెట్ మినిస్టర్ పోస్టు ఇచ్చారు అని మాజీ ముఖ్యమంత్రి, జనతా దళ్ (సెక్యులర్) రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి. కుమారస్వామి గారు వెల్లడించారు.

కుమార స్వామి
కుమార స్వామి గారు ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అవినీతి వ్యతిరేక ప్రచారం చేస్తున్నప్పుడు మరి అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది అని అడిగారు.

బ్లాక్ మనీనా లేదా వైట్ మనీనా
నా పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన డబ్బు బ్లాక్ మనీనా లేదా వైట్ మనీనా అని వారు స్పష్టం చేయవలసి ఉంది. అంత డబ్బు ఎక్కడ ఉంది? బిజెపి ఖజానాలో వారు దానిని ఉంచారా? ఇంత జరుగుతున్న ఆదాయపన్ను శాఖ దాని గురించి ఏమి స్పందించడం లేదు అని అడిగారు.

ఆపరేషన్ కమలాని
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బిజెపి ఆతృతలో ఉందని పేర్కొంటూ, "2008 లో ఆపరేషన్ కమలాని మొదటి పెట్టి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసింది ఇంకా ఎవరు మర్చిపోలేరు అని చెప్పారు.పోలీసు వాహనాలు, అంబులెన్సుల్లో 25 కోట్లకు నుంచి ₹ 30 కోట్ల రూపాయలు పంపించారు 'అని ఆయన అన్నారు.

బీజేపీ కూడా ఘాటుగా
ఇది ఎలా ఉండగా బీజేపీ కూడా ఘాటుగా స్పందించింది. బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రముఖ లీడర్ మేము ఎటువంటి ప్రలోభాలకు పాల్పడలేదు అని మీడియాతో చేప్పారు. బీజేపీ పార్టీ మీద అభిమానంతో వస్తున్నారు అని చెప్పారు

ఈగిల్టన్ రిసార్ట్
ఇది ఇలా జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ మరియు జెడిఎస్ పార్టీ వారి MLA లను కాపాడుకోవాలని అని బెంగుళూరుకు సమీపంలో ఉన్న ఈగిల్టన్ రిసార్ట్ కి తరలించారు.
ఇక ఇక్కడ ఒక రోజు ఉండడానికి రూ.6000 వసూలు చేస్తారు ఇలా 120 రూములు బుక్ చేశారు.

బ్లాక్‌మనీతో
బ్లాక్‌మనీతో బీజేపీ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోంది. అలాంటి కుయుక్తులతోటే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధ్దమయ్యింది. గవర్నర్ హై డ్రామా నడిపి బీజేపీ కొమ్ముకాయడం దుర్మార్గం'' అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు

గవర్నర్ చర్య
మోదీ అప్రజాస్వామిక విధానాలు కర్ణాటక ఎన్నికల్లో మరింతగా బహిర్గతమయ్యాయన్నారు. గవర్నర్ చర్య అప్రజాస్వామిక పాలనకు పరాకాష్ఠగా పేర్కొన్నారు.

పెద్ద నోట్ల రద్దు తరువాత
పెద్ద నోట్ల రద్దు తరువాత వరుసగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ వైపు నుంచి ధన ప్రవాహం 100 శాతం ఎక్కువైందని అన్నారు.
కర్ణాటకలో బీజేపీ నైతికంగా ఓడిందన్నారు. బలపరీక్షకు 15 రోజుల పాటు అవకాశం ఇవ్వడమంటే ఎమ్మెల్యేల కొనుగోలుకు అవకాశం ఇచ్చినట్లేనన్నారు.

పార్క్ హయత్
పరిస్థిలు చేజారిపోతుండడంతో కాంగ్రెస్ మరియు జెడిఎస్ రెండు పార్టీలు వారి MLA లను కాపాడుకోవడానికి బెంగుళూరు ఈగిల్టన్ రిసార్ట్ నుంచి హైదరాబాద్ లో ఉన్న పార్క్ హయత్ హోటల్లో ఉంచారు. ఇక్కడ రోజుకి దాదాపుగా రూ.7000 ఉంటుంది.

సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల మేరకు
చివరికి సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల మేరకు రేపు సాయంత్రం 4 గంటలకు బలనిరూపణ చేసుకోవాలి అని సుప్రీమ్ కోర్ట్ ఆదేశింది. దీని కోసం ఇటు బీజేపీ అటు కాగ్రెస్ మరియు జెడిస్ సిద్ధంగా ఉంది . మొత్తం MLA లు అంత హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు తిరుగు ప్రయాణం పట్టారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications