ఈ నెలలో పెట్రోలు, డీజిల్ రేట్లు రెండు సార్లు పెరిగాయి. మే 14 న, కర్నాటక ఎన్నికల ఫలితానికి ఒక రోజుకు ముందు అంటే 19 రోజుల విరామం తరువాత ధరలు అమాంతరంగా పెరిగాయి.
ఈ నెలలో పెట్రోలు, డీజిల్ రేట్లు రెండు సార్లు పెరిగాయి. మే 14 న, కర్నాటక ఎన్నికల ఫలితానికి ఒక రోజుకు ముందు అంటే 19 రోజుల విరామం తరువాత ధరలు అమాంతరంగా పెరిగాయి.

బుధవారం నాడు దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర పెరగడంతో దేశ రాజధానిలో లీటరుకు 75 రూపాయలు దాటింది.
ఢిల్లీలో లీటరుకు రూ .75.10 గా నిర్ణయించారు.ఇది 2013 సెప్టెంబరులో లీటరు రూ .76.06 గా ఉన్నప్పటి తో పోల్చి చూస్తే మరి ఆ తరహాలో ధరలు ఇప్పుడు మరోసారి పునరావృతం అయ్యాయి.
కోల్కతా, ముంబై, చెన్నైలలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోలు ధర వరుసగా తాజాగా ఉన్న ధరలు రూ.77.79 , 82.94, 77.93 రూపాయలు గా నమోదయ్యాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్ వెల్లడించింది. .
ఈ నగరాల్లో గతంలో రూ.78.03 (కోల్కతా, ఆగస్టు 2014), 83.62 (ముంబై, సెప్టెంబర్ 2013) మరియు 79.55 రూపాయలు (చెన్నై, సెప్టెంబర్ 2013)గా ఉన్నాయి.
అదేవిధంగా, డీజిల్ ధర బుధవారం కూడా తాజా రికార్డు స్థాయిలను తాకింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలలో ఇంధనం ధర రూ.66.57, రూ .69.11, రూ .70.88, 70.25 చొప్పున విక్రయిస్తున్నారు.
సోమవారం, 19 రోజుల విరామం తరువాత ఐఒసి డైనమిక్ ప్రైసింగ్ సిస్టంను పునరుద్ధరించిన తరువాత వరుసగా మూడోరోజు రవాణా ఇంధనాల ధరలు పెరిగాయి.


Click it and Unblock the Notifications