రిలయన్స్ జియో సరికొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్ 'జీరో టచ్'ను అందుబాటులోకి తెచ్చింది. దీని నెలవారీ అద్దె 199 రూపాయలు. ఈ ప్లాన్ కింద నిమిషానికి 50 పైసల ప్రారంభ ధరతో అమెరికా, కెనడాకు కాల్స్ మాట్లాడవచ్చు. రోమింగ్‌లో చేసే కాల్స్‌పైనా తక్కువ చార్జీలనే వసూలు చేయనున్నట్టు సంస్థ తెలిపింది. ఈ చార్జీ నిమిషానికి 2 రూపాయల నుంచి ఉంటుందని పేర్కొంది. వాయిస్, డేటా, ఎస్‌ఎంఎ్‌సలకు ఈ చార్జీలు వర్తిస్తాయని తెలిపింది. మే 15వ తేదీ నుంచి ఈ ప్లాన్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్ 309 రూపాయల నుంచి ప్రారంభం అవుతోంది. ఇక 199 రూపాయల ప్లాన్‌ను ఎంచుకునే కస్టమర్లు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ప్లాన్ కింద ఉచిత వాయిస్, ఎస్‌ఎంఎ్‌సలు, 25 జిబి 4జి డేటా లభిస్తుంది.

ఇక విదేశాలకు చేసే కాల్ చార్జీల విషయానికొస్తే.. అమెరికా, కెనడాకు నిమిషానికి 50 పైసలు, చైనా, ఫ్రాన్స్, ఇటలీ, యుకె, సింగపూర్, బంగ్లాదేశ్‌కు నిమిషానికి 2 రూపాయలు, ఆస్ర్టేలియా, బహ్రెయిన్‌కు నిమిషానికి 4 రూపాయలు, కువైట్‌కు నిమిషానికి 5 రూపాయలు, సౌదీ అరేబియా, యుఎఇకి నిమిషానికి 6 రూపాయలుగా ఉన్నట్టు జియో తెలిపింది. కంటెంట్ ఫ్రొమ్ ఏబిన్.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications