ఇప్పటికే ATM లలో డబ్బులు లేక సతమతం అవుతున్న సామాన్యుడికి ఇది చేదు వార్తే . ఇక పై రూ.100 నోట్లు ATM లలో కనపడవు ఏమో ఎందుకుఅంటే ప్రస్తుతం చలామణి ఉన్న రూ.100 రూపాయిల నోట్లు దాదాపు దీర్ణస్థితికి చేరుకోవడమే.

కొత్త నోట్ల సైజు
దీనికి తోడు కొత్త నోట్ల సైజు మారడం ATM లో క్యాష్ పెట్టే క్యాసెట్ సైజు మారడం మరియు రూ.100 నోట్ల సైజు ఒక రకంగా ఉండడంతో ఇబ్బంది కలుగుతోంది అంటున్నారు.

దీర్ణస్థితి
దీనికి తోడు రూ.100 దీర్ణస్థితి చేరుకోవడం వాటిని ATM లలో పెడితే అవి బయటకి రాకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి.

సాంకేతిక కారణాల వల్ల
రూ.100 నోట్లలో కొన్ని 2005 సంత్సరం కన్నా ముందువి ఉండడంతో సాంకేతిక కారణాల వల్ల ఆ డబ్బును ఎటిఎంలు వినియోగదారులకి అందిచలేక పోతున్నాయి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని RBI కి బ్యాంకింగ్ సంస్థలు తెలియజేశాయి.

నోట్ల రద్దు
వాస్తవానికి నోట్ల రద్దు అనంతరం 2016 2017 లో 5 లక్షల కొత్త వంద రూపాయిల నోట్లను విడుదల చేసింది ఐతే ఈ వందనోట్లు ఏ మాత్రం సరిపోలేదు అని చెబుతున్నారు.

రూ.2000 నోటు మార్పిడి
రూ.2000 నోటు మార్పిడి చేసినప్పుడు రూ.100 నోట్ల అవసరం చాల ఉంటుంది అని బ్యాంకర్లు చెబుతున్నారు. అదే సమయంలో రూ.500 రూపాయిల నోట్లు దొరకడం కూడా కష్టం అవ్వుతోంది అని బ్యాంకర్లు చెబుతున్నారు. పరిస్థి ఇలాగే ఉంటే భవిషత్తులో రూ.100 నోట్లు ATM లలో కనిపించడం కష్టమే అని బ్యాంకర్లు చెబుతున్నారు.

కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి
నగదు కష్టాన్ని తీర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాము అని కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శుభాష్ చంద్ర గారు వెల్లడించారు. రోజురోజుకు నగదుకు పెరుగుతున్న డిమాండ్ కోసం రోజుకు రూ. 3 వేల కోట్ల నగదును ముద్రిస్తున్నట్లు అయన చెప్పారు. ప్రస్తుతం దేశంలో నగదు కొరత సమస్య అతి త్రీవ్రంగా లేదు అని ప్రస్తుతం ఉన్న డిమాండ్లని త్వరలోనే తీరుస్తాం అని అయన చెప్పారు.


Click it and Unblock the Notifications