ఇటీవలే కుమారుడి నిశ్చితార్థం జరిపించిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట వరుస పెళ్లిళ్ల సందడి!

దాని కన్నా ముందే
ఆయన కుమార్తె ఈషా అంబానీ.. పిరమల్ గ్రూప్ వారసుడు, అజయ్ పిరమల్, స్వాతి దంపతుల కుమారుడు ఆనంద్ పిరమల్‌ను పెళ్లి చేసుకోబోతోంది. ఈషా సోదరుడు ఆకాశ్ అంబానీ పెళ్లి ఈ ఏడాది డిసెంబరులో జరగనుంది. దాని కన్నా ముందే అదే నెలలో ఈషా పెళ్లి జరగొచ్చని సమాచారం

మహాబలేశ్వర్‌లో
ఈషా, ఆనంద్ చాలాకాలంగా స్నేహితులు. అంబానీ, పిరమల్ కుటుంబాల మధ్య నాలుగు దశాబ్దాలుగా మంచి స్నేహం ఉంది. ఆనంద్ పిరమల్ ఇటీవలే మహాబలేశ్వర్‌లో ఒక గుడి దగ్గర ఈషాకు ప్రపోజ్ చేశారు. ఆమె ఒప్పుకోవడం.. ఇరువైపులా పెద్దలకు తెలియజేయడం.. వాళ్లూ అంగీకరించడం వేగంగా జరిగిపోయాయి.

ఆనంద్ పిరమల్
పెన్సిల్వేనియా వర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్, హార్వర్డ్ వర్సిటీలో ఎంబీయే చేసిన ఆనంద్ పిరమల్ ప్రస్తుతం పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘పిరమల్ రియల్టీ' పేరుతో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని స్థాపించారు. ‘పిరమల్ స్వాస్థ్య' పేరుతో గ్రామీణ ఆరోగ్య సంరక్షణ సంస్థను స్థాపించి, రోజుకు 40 వేల మంది రోగులకు చికిత్సనందిస్తున్నారు.

ఈషా అంబానీ
ఇక, యేల్ యూనివర్సిటీ నుంచి ‘సైకాలజీ అండ్ సౌత్ ఏషియన్ స్టడీస్'లో పట్టభద్రురాలైన ఈషా.. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ బోర్డుల్లో సభ్యురాలిగా ఉంది. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే చేస్తోంది. జూన్ నాటికి ఆమె చదువు పూర్తవుతుంది. కాగా.. ఆనంద్ ఈషాకు ప్రపోజ్ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆకాష్ అంబానీ
ముకేష్ అమనీ కుమారుడు ఆకాష్ అంబానీ వజ్ర వ్యాపారవేత్త కుమార్తె సులోకా మెహతాను వివాహం చేసుకున్నాడు. డైమండ్ వ్యాపారవేత్త రసెల్ మెహతా కుమార్తె, సులోహా మెహతా ఆకాశ్ అంబానీ యొక్క విద్యావేత్త.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications