ముకేశ్ అంబానీ మరో సంచలన నిర్ణయం..... 1 . 1 TB డేటా ఫ్రీ
4జీ సర్వీసులతో దేశంలో మొబైల్ విప్లవం సృష్టించిన రిలయన్స్ జియో అదేస్థాయిలో మరో విప్లవం సృష్టించబోతున్నది. ఉచిత వాయిస్ కాల్స్, తక్కువ ధరలకే మొబైల్ ఫోన్‌లు, అతి తక్కువ ధరలకే మొబైల్ డేటా అందించింది.

దేశవ్యాప్తంగా
టెలికం రంగంలో అగ్రభాగాన ఉన్న జియో గుట్టుచప్పుడు కాకుండా ఫైబర్ టు హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లుచేస్తున్నది. ఈ ఏడాది జూలై, డిసెంబర్ మధ్య దేశవ్యాప్తంగా ఈ సర్వీసును ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.

నెలకు 1100 టి బి
ఎవరూ ఊహించనివిధంగా నెలకు 1100 జీబీ ఉచిత డేటాను 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఫైబర్ టు హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌లో ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇందుకు రూ.4,500 రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌ను వసూలు చేస్తారని తెలిసింది.

దేశంలోని 99శాతం
దేశంలోని 99శాతం ప్రాంతాలకు ఈ సేవలను అందించనుంది. ఈ సేవలను పొందేవారికి జియో రూటర్‌ను అందిస్తుంది. అది సెట్‌టాప్ బాక్స్‌వలే కూడా పనిచేస్తుంది. దీని ద్వారా అనేక సేవలు పొందేందుకు వీలవుతుంది. సుమారు 360టీవీ చానల్స్ ఈ బాక్సు ద్వారా పొందవచ్చంటున్నారు.

50 హెచ్‌డీ చానల్స్
ఇందులో 50 హెచ్‌డీ చానల్స్ ఉంటాయి. ఈ బాక్సుకు అనుబంధంగా ఉండే రూటర్ ద్వారా వైఫై సిగ్నల్స్ వస్తాయి. ఇంటిలోని వారందరూ ఒకేసారి మొబైల్, ట్యాబ్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ల ద్వారా హైస్పీడ్ డేటా సేవలను పొందేందుకు వీలవుతుంది.

అమెజాన్ ప్రైమ్
నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ వీడియోలను కూడా ఇందులో భాగంగానే చూసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది. కొంతకాలంపాటు ఈ సేవలు ఉచితంగానే లభించే అవకాశం ఉంది.కంటెంట్ ఫ్రొం ఏబిన్.


Click it and Unblock the Notifications